వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: అమెరికా అంతటా డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాలు!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక వర్గం తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తన ప్రచారంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ట్రంప్.. నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాలను కొందరు అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. న్యూయార్క్ నగర పార్కులో ఏర్పాటు చేసిన ట్రంప్ నగ్న విగ్రహం అటువైపుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. దాని ముందు ఫొటోలు దిగుతూ జనం అక్కడ సందడి చేయడం గమనార్హం.

ఈ వింత విగ్రహాలను చూసేందుకు జనం అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. కొంత మంది ఆ విగ్రహాలను చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇదేం వింత అంటూ నోరెళ్లబెడుతున్నారు. కొందరైతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫొటోలను తీస్తున్నారు. మరికొందరు సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాకు ఎక్కుతున్నారు.

అయితే, ఆ విగ్రహాలకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అధికారులు రంగంలోకి దిగి వాటిని తొలగించే పనిలో పడ్డారు. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ఏంజిల్స్, సియాటెల్, క్లీవ్ లాండ్ లాంటి తదితర నగరాల్లో కూడా విగ్రహాలు వెలిశాయి. కాగా, ఈ నగ్న విగ్రహాల వ్యవహారంపై ట్రంప్ వర్గం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

English summary
An artists' collective took credit for exposing Donald Trump to unflattering scrutiny on Thursday, saying it was responsible for a life-sized nude statue of the Republican presidential candidate that turned up in a New York City park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X