వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడికి బ్రిటన్‌లో మంత్రి పదవి

|
Google Oneindia TeluguNews

లండన్: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కు బ్రిటన్ మంత్రి వర్గంలో చోటు దక్కింది. రిషిని బ్రిటన్ ప్రధాని థెరీసా మే తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఇలాగే ముందుకు: మోడీ సర్కారులో ఉత్సాహాన్ని నింపిన ప్రపంచ బ్యాంక్, 7.3శాతం గ్రోత్ఇలాగే ముందుకు: మోడీ సర్కారులో ఉత్సాహాన్ని నింపిన ప్రపంచ బ్యాంక్, 7.3శాతం గ్రోత్

కాగా, ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎక్కువగా మహిళలకు, మైనార్టీ చట్టసభ సభ్యులకు అవకాశం కల్పించడం గమనార్హం.

 మంత్రివర్గంలోకి రిషి

మంత్రివర్గంలోకి రిషి

36ఏళ్ల రిషి గత బ్రిటన్ ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషికి హౌసింగ్, కమ్యూనిటీస్, లోకల్ గవర్నమెంట్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు.

Recommended Video

Nandan Nilekani set to return as Infosys Non-Executive Chairman | Oneindia Telugu
 ట్విట్టర్‌లో వెల్లడి

ట్విట్టర్‌లో వెల్లడి

ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం మంగళవారం రాత్రి ట్విట్టర్‌లో వెల్లడించింది. రిషితోపాటు మరో భారత సంతతి ఎంపీ సుయెల్ల ఫెర్నాండెజ్‌కు కూడా మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మరికొంత మంది ఇతర బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

 వరుసగా రిచ్ మండ్ నుంచి ఎన్నిక

వరుసగా రిచ్ మండ్ నుంచి ఎన్నిక

2015లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నియోజకవర్గం నుంచి రిషి సునక్ విజయం సాధించారు. ఆ తర్వాత 2017లో మరోసారి అక్కడ్నుంచి గెలుపొందారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన సునక్ లండన్‌లో ఓ పెట్టుబడి సంస్థను స్థాపించారు.

 అక్షితాతో వివాహం, ఇద్దరు పిల్లలు

అక్షితాతో వివాహం, ఇద్దరు పిల్లలు

అనంతరం 2014లో బ్రిటన్ రాజకీయాల్లోకి వచ్చారు. స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్‌లో సహ విద్యార్థి అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారడంతో ఆమెను సునక్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

English summary
British Prime Minister Theresa May inducted two Indian-origin MPs into the Conservative government, including Rishi Sunak, who is the son-in-law of Infosys co-founder Narayana Murthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X