వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయంగా మోడీ హవా: టాప్ 10లో, అందుకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి ప్రధాని నరేంద్ర మోడీని నిరాశపర్చింది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ప్రధాని మోడీ హవా కొనసాగుతోంది. టైమ్ పర్సన్ ఆప్ ది ఇయర్ ఛాయిస్ పోల్‌లో ప్రధాని ప్రస్తుతం టాప్ 10లో నిలిచారు.

సోమవారం సాయంత్రానికి ప్రధాని మోడీ 2.7 శాతం ఓట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారత్‌లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఆధునికీకరించేందుకు మోడీ యత్నించడం వంటి అంశాలను టైమ్ ప్రొఫైల్‌లో పేర్కొంది.

Narendra Modi in eighth place for Time magazine's Person of the Year Poll

టాప్ 10లో మోడీతో పాటు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న పాకిస్తాన్ బాలిక యూసఫ్ జాయ్ మలాలా తదితరులు ఉన్నారు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన పోటీదారుడు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌ల కంటే ఎక్కువ మంద్దతు లభించింది.

మలాలా, పోప్ ఫ్రాన్సిస్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నాలుగో స్థానంలో నిలిచారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 25వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ 55వ స్థానంలో ఉన్నారు. ఈ పోల్ ఈ నెల 4వ తేదీతో ముగుస్తుంది. విజేతను ఏడో తేదిన ప్రకటిస్తారు.

English summary
Indian Prime Minister Narendra Modi is currently among the top 10 of the TIME Person of the Year readers' choice poll in the company of Nobel Peace Prize winner Malala Yousafzai and Pope Francis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X