వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ నవరాత్రి దీక్షతో ఇబ్బంది లేదు, తెల్సు: వైట్‌హౌస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో నవరాత్రి దీక్షలో ఉండటం వల్ల ఇబ్బందేమీ లేదని, అతిథులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేస్తామని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు. మోడీ నవరాత్రి ఉపవాస దీక్ష గురించి తమకు తెలుసునని చెప్పారు.

అందుకు తగినట్లు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇది అంత పెద్ద విషయమేమి కాదని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కైటలిన్ హేడెన్ తెలిపారు. ఆమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీల పర్యటన విజయవంతం కావాలని ఆశిస్తున్న నేపథ్యంలో తాము ఎలాంటి సమస్యలు రానీయమని వ్యాఖ్యానించారు.

కాగా, చైనా ప్రధాని జీ జిన్‌పింగ్ భారత్‌కు తన మూడు రోజుల పర్యటనకు వచ్చినప్పుడు గుజరాతీ వంటకాలను వడ్డించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు మోడీ అమెరికా వస్తుండటంతో అక్కడున్న ఎన్నారైలు ఆయనకు గుజరాతీ వంటకాలను వడ్డించేందుకు సిద్దమయ్యారు. ఐతే ప్రధాని మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో ఉపవాసం కారణంగా ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వారందరిని నిరాశకు గురి చేసింది.

Narendra Modi's navratri fast not an issue: White House

మోడీ అమెరికాలో ఉండే సమయానికి భారత్‌లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు దశాబ్లాలుగా మోడీ నవరాత్రి ఉపవాసం చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి, ధ్యానం, ప్రార్దనలు చేసుకుంటారని మోడీతో గత 12 ఏళ్లుగా అత్యంత సన్నిహతంగా పని చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు.

సెప్టెంబర్ 29న మోడీ వైట్‌హౌస్‌లో మోడీ గౌరవార్దం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ అధికారిక డిన్నర్(స్టేట్ డిన్నర్) కానప్పటికీ ప్రెసిడెంట్ ఒబామా, ఆయన కేబినెట్ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ కారణంగా వైట్‌హౌస్‌లో అధికారిక విందును ఏర్పాటు చేయడం లేదు. అలాగే అమెరికన్ సీఈఓలు అదే రోజు మోడీకి బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు.

ఈ రెండు కార్యక్రమాలకు హాజరవనున్న మోడీ, ప్రతిచోటా కేవలం టీ, నిమ్మరసం మాత్రమే తీసుకుంటారని ప్రధాని కార్యాలయ వర్దాలు తెలిపాయి. భారత్‌లో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు నవరాత్రులు జరగనున్నాయి. ఐతే మోడీ అమెరికా పర్యటనలో భాగంగా 25వ తేదీ సాయంత్రమే అమెరికాకు బయల్దేరి వెళ్లి అక్టోబర్ 1న ఇండియాకు తిరిగి వస్తారు.

English summary

 In view of Prime Minister Narendra Modi observing 'Navratri' fast during his US visit, the White House today said this is unlikely to be an issue as they respectfully accommodate the practices of visitors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X