సుందర్ పిచాయ్‌కి మోడీ, నాదెళ్ల అభినందనల ట్వీట్లు
న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆల్ఫాబేట్ సిఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కి ప్రపంచ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Congratulations
@sundarpichai.
My
best
wishes
for
the
new
role
at
@google.
—
Narendra
Modi
(@narendramodi)
August
11,
2015
గూగుల్ ఆల్ఫాబేట్ సిఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న సుందర్ పిచాయ్‌కి భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. గూగుల్ కొత్త పాత్ర పోషించనున్న సుందర్ పిచాయ్‌కు శుభాకాంక్షలు అంటూ మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Congrats
@sundarpichai
well
deserved!
—
Satya
Nadella
(@satyanadella)
August
10,
2015
మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎరిక్ శుభాకాంక్షలు తెలిపారు. సుందర్ దార్శనికత కలిగిన వ్యక్తి అని, త్వరలోనే గొప్ప సిఈఓగా ఎదుగుతారని ఎరిక్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆపిల్ సిఈఓ టిమ్ కుక్ కూడా సుందర్ పిచాయ్‌కి అభినందనలు తెలిపారు.
Really
excited
about
the
vision
and
brilliance
of
Sundar..
he's
going
to
be
a
great
CEO!
http://t.co/2bqtPEjoQH
—
Eric
Schmidt
(@ericschmidt)
August
10,
2015
ప్రపంచ దిగ్గజ సంస్థకు సిఈఓగా బాధ్యతలు చేపట్టనున్న పిచాయ్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు.
@sundarpichai
Congratulations
on
your
promotion!
—
Tim
Cook
(@tim_cook)
August
11,
2015
కాగా, తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ పిచాయ్ 1972లో జన్మించారు. పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం సిఈఓ స్థాయికి చేరారు.