• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విక్రమ్ ల్యాండర్ కోసం రంగంలో దిగిన నాసా: డీప్ స్పేస్ యాంటెనాలతో హలో అంటూ సంకేతాలు

|
  విక్రమ్ ల్యాండర్ ను కనుగొనే ప్రయత్నాల్లో నాసా || Oneindia Telugu

  న్యూయార్క్: చందమామ ఉపరితలంపై దిగిన అనంతరం జాడ తెలియరాకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ కోసం ఇక ఏకంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలో దిగింది. హలో అంటూ ఏకధాటిగా జాబిల్లి మీదికి ఏకధాటిగా సంకేతాలను పంపిస్తోంది. డీప్ స్పేస్ యాంటెన్నాల ద్వారా చంద్రుడి మీదికి నాసా సంకేతాలను పంపిస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔత్సాహిక అంతరిక్ష పరిశోధకుడు స్కాట్ టిల్లీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. స్పెయిన్ లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని క్యాన్ బెర్రా, కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ ప్రాంతాల్లో నాసాకు డీప్ స్పేస్ స్టేషన్ యాంటెన్నాలు ఉన్నాయి. వాటి ద్వారా హలో అనే సంకేతాలను పంపిస్తున్నట్లు తెలిపారు.

  భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా జాబిల్లి మీదికి పంపించిన విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయి ఉంటుందని అనుమానిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీన చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ఆచూకీ గల్లంతైంది. సుమారు 36 గంటల తరువాత ల్యాండర్.. చంద్రుడి మీద దిగినట్లు గుర్తించారు. చంద్రుడి ఉపరితలం మీద హార్డ్ ల్యాండ్ అయినట్లు నిర్ధారిస్తూ ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు.

   NASA antennas are trying to connect with Chandrayaan-2 lander

  అప్పటి నుంచీ ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్ తో అనుసంధానం కావడానికి చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిరంతరాయంగా సంకేతాలను పంపించినప్పటికీ.. ల్యాండర్ వాటిని గ్రహించట్లేదని నిర్ధారించారు. ల్యాండర్ నిద్రాణంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఓ నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ తమ ప్రయత్నాలను మానుకోలేదు. వివిధ రూపాల్లో సంకేతాలను పంపిస్తూనే ఉన్నారు. తాజాగా- నాసా శాస్త్రవేత్తలు కూడా ల్యాండర్ జాడ కోసం రంగంలోకి దిగారు. ఇస్రో కంటే బలమైన, అత్యాధునికమైన సంకేతాలను వారు చంద్రుడి మీదికి పంపిస్తున్నట్లు స్కాట్ టిల్లీ తెలిపారు.

  డీఎస్ఎన్ 24 బీమ్స్ 12 కిలో వాట్ల శక్తిమంతమైన సంకేతాలను పంపిస్తున్నామని ఆయన తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. తాము పంపించిన సిగ్నళ్లు చంద్రుడిని చేరి.. మళ్లీ భూమికి అందుతున్నాయని, దీనితో ఓ సర్క్యూట్ పూర్తి అయినట్టు భావిస్తున్నామని అన్నారు. ఎర్త్-మూన్-ఎర్త్ సర్క్యుట్ లో 2103 మెగా హెర్ట్జ్ తో తాము పంపిన సంకేతాలు వెనక్కి వస్తున్నాయని చెప్పారు. నాసా పంపిస్తోన్న సంకేతాలు శక్తిమంతమైనవి కావడం వల్ల త్వరలోనే వాటిని విక్రమ్ ల్యాండర్ గ్రహించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Besides Indian Space Research Organisation’s (Isro's) last-ditch effort to establish a communication link with Vikram lander that is lying motionless on the lunar surface after a “hard-landing” on September 7, National Aeronautics and Space Administration (Nasa) has also sent hello messages to the Indian lander on Moon in order to connect with it. The NASA's Jet Propulsion Laboratory is helping ISRO in connecting with Vikram as per the prior contract with two space agencies.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more