వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పేస్‌సూట్ల కొరత! నాసా ప్రయోగం వాయిదా!

|
Google Oneindia TeluguNews

అంతరిక్షంలో మరో అద్భుతం సృష్టించాలనుకున్న నాసా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. మహిళా వ్యోమగాములతో స్పేస్‌వాక్ నిర్వహించాలనుకున్న సంస్థకు స్పేస్ సూట్ల కొరత అడ్డంకిగా మారింది. దీంతో యాన్ మెక్ క్లెయిన్, క్రిస్టినా కోచ్‌లతో 7 గంటల పాటు స్పేస్ వాక్ చేయించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది.

వెనిజులా చేరుకున్న రష్యా బలగాలు, ఉద్రిక్తతలు పెంచొద్దని అమెరికా వార్నింగ్వెనిజులా చేరుకున్న రష్యా బలగాలు, ఉద్రిక్తతలు పెంచొద్దని అమెరికా వార్నింగ్

నాసాలో స్పేస్‌సూట్ల కొరత
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించే నాసా ఈసారి మహిళా ఆస్ట్రోనాట్స్ తో స్పేస్ వాక్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు మార్చి 29న ముహూర్తం నిర్ణయించింది. మహిళా వ్యోమగాములైన యాన్ మెక్ క్లెయిన్, కెనడా స్పేస్ ఏజెన్సీ ప్లయిట్ కంట్రోలర్ క్రిస్టీనా కోచ్‌లు ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటారని ప్రకటించింది. తాజాగా మరో ఆస్ట్రోనాట్ నిక్ హ్యూజ్ కూడా ప్రయోగంలో పాలుపంచుకుంటారని నాసా ప్రకటించింది. అయితే క్రిస్టీనా, మెక్ క్లెయిన్‌లాగే ఆమె ధరించాల్సిన స్పేస్ సూట్ కూడా మీడియం సైజుదే కావడంతో ఇబ్బంది తలెత్తింది.

NASA cancels its first all-female spacewalk, heres why

ప్రయోగం వాయిదా
ప్రస్తుతం నాసా వద్ద మీడియం సైజ్ స్పేస్ సూట్ ఒకటే ఉంది. తొలుత ఇద్దరు మహిళా వ్యోమగాములను మాత్రమే పంపాలని నిర్ణయించడంతో మరో మీడియం సైజు స్పేస్‌సూట్ షర్టు తయారీకి సిద్ధమయ్యారు. తాజాగా నిక్ హ్యూజ్ మహిళా ఆస్ట్రోనాట్ల టీంలో చేరడంతో శుక్రవారానికల్లా మరో స్పేస్‌సూట్ షర్టు తయారు చేయడం అసాధ్యమని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాసా ఉమెన్ ఆస్ట్రోనాట్ స్పేస్‌వాక్ మిషన్‌ను వాయిదా వేసింది.

English summary
The first all-female spacewalk, which was planned for March 29 by NASA won't be happening this week, the space agency announced on March 25. The historic spacewalk will be delayed because of spacesuit issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X