• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భూమిని కాపాడ‌తారా? నాసాలో ఉద్యోగం.. ఏడాదికి కోటి జీతం!

By Ramesh Babu
|

హూస్ట‌న్‌: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా గ్రహాంతర జీవుల నుంచి భూమిని కాపాడే వారి కోసం చూస్తోంది. దీనికోసం నాసా ఓ కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. ఈ ఉద్యోగం పేరు.. ప్లానెట‌రీ ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్. ఈ మేరకు నాసా ఒక ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

వచ్చింది రెస్పాన్స్... ఉద్యోగం కావాలంటూ నాసాకు 'ఏలియన్' దరఖాస్తు!

గ్రహాంతర జీవుల నుంచి భూమిని, మ‌నుషుల‌ను కాపాడ‌ట‌మే ప్లానెట‌రీ ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్ చేయాల్సిన ప‌ని. దీని కోసం ఏడాదికి లక్షా 87 వేల డాల‌ర్లు (సుమారు రూ.కోటి 19 ల‌క్ష‌లు) చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీనికి అద‌నంగా అల‌వెన్సులు కూడా ఉంటాయి.

NASA Is Hiring A 'Planetary Protection Officer' To Guard Us Against Alien Life - And Vice Versa

భూమిని ర‌క్షించ‌డానికి నాసా కొన్ని విధానాల‌ను పాటిస్తున్న‌ద‌ని ఈ సంద‌ర్భంగా ఆ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. మూడేళ్ల కాలానికిగాను ఈ జాబ్ ఉంటుంది. దీనిని ఐదేళ్లకు కూడా పొడిగించ‌వచ్చు.

ఇత‌ర గ్ర‌హాల‌పైకి అధ్య‌య‌నం కోసం వెళ్లిన‌పుడు అక్క‌డి నుంచి ప‌రిశోధ‌న‌ల కోసం తెచ్చే ప‌దార్థాల వ‌ల్ల భూవాతావ‌ర‌ణానికి, భూమికి ఎలాంటి హాని క‌లుగ‌కుండా చూడాల్సిన బాధ్య‌త‌లో భాగంగా నాసా ఈ కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది.

1967లో ఔట‌ర్ స్పేస్ ఒప్పందాన్ని నాసా కుదుర్చుకుంది. దీని ప్ర‌కారం వేరే గ్ర‌హాల‌కు వెళ్లే స్పేస్‌క్రాఫ్ట్స్ అక్క‌డి ఏలియ‌న్ ప్ర‌పంచాన్ని క‌లుషితం చేయ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఇతర గ్రహాల నుంచి తెచ్చే ప‌దార్థాల ద్వారా భూమికి హాని క‌లుగ‌కుండా చూసేందుకు ఈ కొత్త ఉద్యోగిని నియ‌మిస్తున్నారు. ఇప్ప‌టికే మార్స్ (అరుణ గ్ర‌హం)పై ఉన్న నీటి కార‌ణంగా అక్క‌డ‌ జీవం ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు సైంటిస్టులు గుర్తించారు.

వాటి వ‌ల్ల భూమికి ఎలాంటి హాని జ‌ర‌గ‌కుండా ప్లానెట‌రీ ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్ చూడాల్సి ఉంటుంది. గురు గ్ర‌హం చంద్రుడు యురోపాపైకి నాసా కొత్త‌గా స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపనున్న నేప‌థ్యంలో ఈ కొత్త ఉద్యోగి కోసం ఈ స్పేస్ ఏజెన్సీ చూస్తున్న‌ది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There's a vacancy at NASA, and it may have one of the greatest job titles ever conceived: planetary protection officer. It pays well, between $124,000 and $187,000 annually. You get to work with really smart people as part of the three- to five-year appointment but don't have to manage anyone. And your work could stave off an alien invasion of Earth or, more important, protect other planets from us. President Donald Trump has expressed bullish enthusiasm for America's space program, signing an executive order last month resurrecting the National Space Council, on hiatus since the 1990s, and gleefully discussing the prospect of sending people to Mars. His proposed budget for NASA seeks a slight funding reduction overall, though he wants to realign spending to focus on "deep space exploration rather than Earth-centric research," as The Post reported in March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more