వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపైకి పెర్సివరెన్స్ రోవర్ పంపిన నాసా: కీలక పరిశోధనలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగారక గ్రహంపై ప్రయోగంలో మరో ముందడుగు వేసింది. అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు నాసా పర్సివరెన్స్ రోవర్‌ను రోదసికి పంపింది. ఈ రోవర్ అంతరిక్షంలో ఏడు నెలలు ప్రయాణించి అంగారక గ్రహంపై దిగనుంది.

ఆ గ్రహంపై 'మార్స్ సంవత్సరం' పాటు జీవజాలంపై పరిశోధన చేయనుంది. ఇందు కోసం నాసా అంగారకుడిపై జీవం ఉన్న ప్రాంతంలో రోవర్‌ను దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Nasa launches Mars mission in search of evidence of ancient life

కాగా, ఒకప్పుడు భూమిని పోలిన అంగారక గ్రహం మీద కూడా 3.5 బిలియన్ సంవత్సరాల కిందట భూమ్మీదిలాగే ప్రాణి అవతరించిందా? అవతరించి ఉంటే అది ఏమైంది? అనే విషయాలను ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోనున్నారు. ఇందులో భాగంగానే అమెరికా పర్సివరెన్స్‌ను పంపించారు.

నాసా పంపిన పర్సివరెన్స్‌లో రెండు రకాల పరికరాలున్నాయి. ఇవి అంగారక గ్రహ ఉపరితలం మీద ఉండే రాళ్లు రప్పల్లో ఎలాంటి ఖనిజాలున్నాయి, ఆర్గానిక్ అణువులేవయినా ఉన్నాయా? అనే విషయాలను పరిశీలిస్తాయి. ఇందులో ఒక పరికరం షెర్లాక్. రోవర్ రోబోటిక్ చేతి చివర ఉండే షెర్లాక్ తనకు ఎదురుబడే రాళ్లలోకి లేజర్ కిరణాలు పంపి తన అన్వేషణ మొదలు పెడుతుంది.

రెండో పరికరం వాట్సన్. ఇదొక కెమెరా. షెర్లాక్ పరిశీలించే రాళ్లని ఫొటోలు తీయడమే దీని పని. కాగా, పర్సివరెన్స్ రోజుకొకసారి మాత్రమే భూమ్మీది నుంచి సూచనలు తీసుకుంటుంది. దీనికి రేడియో తరంగాలు అంగారకుడికి చేరుకునేందుకు చాలా సమయం పట్టడమే కారణం. పర్సివరెన్స్ అంగారక గహంపై ధ్వనులను కూడా రికార్డు చేయగలుగుతుంది.

English summary
Nasa’s new car-sized robotic spacecraft is on its way to Mars in a mission to search for evidence of ancient life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X