వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Video:స్పేస్ స్టేషన్‌కు 8వేల పౌండ్ల సరుకుతో టేకాఫ్ తీసుకున్న కల్పనా చావ్లా స్పేస్ క్రాఫ్ట్..!

|
Google Oneindia TeluguNews

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు నార్త్రోప్ గ్రూమన్స్ యాంటేర్స్ రాకెట్‌ మరియు సిగ్నస్ స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపింది. వర్జీనియా తూర్పు తీరంలో ఉన్న వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీలోని మిడ్ అట్లాంటిక్ రీజియనల్ స్పేస్ పోర్టు నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్‌ నింగిలోకి ఎగిరింది. అంతరిక్షంలోకి సరుకులను మోసుకెళ్లేందుకు ప్రత్యేకంగా నార్త్రోప్ గ్రుమన్ సిగ్నస్ అనే ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను రూపొందించారు. అంతేకాదు భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా పేరును ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌కు పెట్టారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి 360 డిగ్రీల కెమెరాతో పాటు ముల్లంగి విత్తనాలను తీసుకెళ్లింది.

Recommended Video

NASA Launches Kalpana Chawla Cargo Spacecraft to Space Station అంతరిక్షంలో ముల్లంగి పెంపకం...!!

Asteroid:భూమికి అత్యంత దగ్గరగా భారీ గ్రహశకలం, ఆదివారం రోజు జాగ్రత్త..నాసా ఏం చెబుతోంది?Asteroid:భూమికి అత్యంత దగ్గరగా భారీ గ్రహశకలం, ఆదివారం రోజు జాగ్రత్త..నాసా ఏం చెబుతోంది?

నింగిలోకి 8వేల పౌండ్లు బరువున్న సరుకులు

ఇక రాకెట్ ప్రయోగంలో భాగంగా రెండో దశలో సిగ్నస్ స్పేస్ క్రాఫ్ట్ , యాంటారే రాకెట్ నుంచి వేరుపడింది. ఇక సిగ్నస్ స్పేస్‌ క్రాఫ్ట్ 8వేల పౌండ్ల బరువున్న సరుకును అంతరిక్షంకు మోసుకెళుతోంది. రాకెట్ లాంచ్ అయ్యాక అది దక్షిణ హిందూ మహాసముద్రంపై ఎగురుతూ కనిపించింది. ఈ సిగ్నస్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్‌లో డిసెంబర్ నెల మధ్య వరకు ఉంటుంది.ఆ తర్వాత తిరిగి భూమికి చేరుకుంటుంది. ఈ ప్రయోగం అద్భుతంగా జరిగిందని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామర్ కెన్నెత్ టాడ్ చెప్పారు.

 మహిళల కోసం ప్రత్యేక టాయ్‌లెట్లు

మహిళల కోసం ప్రత్యేక టాయ్‌లెట్లు

ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో 23 మిలియన్ డాలర్లతో మహిళల కోసం టైటానియం టాయ్‌లెట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.అంతేకాదు ఇది స్పేస్ స్టేషన్‌కు చేరుకోగానే అక్కడి పరిసరాలను షూట్ చేసేలా ప్రత్యేకమైన కెమెరాలను అమర్చారు. అక్టోబర్ 31న వ్యోమగాములను రెండో సారి స్పేస్ స్టేషన్‌కు స్పేస్ ఎక్స్ ద్వారా పంపనున్న నేపథ్యంలో ఈ సారి ఆరు నుంచి ఏడు మంది వ్యోమగాములకు సరిపడేలా మరింత తాజా ఆహారంను ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో పంపారు. ఇక తమకు ఇష్టమైన ఆహారంను వ్యోమగాములు తీసుకెళ్లారు. అంతేకాదు స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములే పండించే ముల్లంగిని తినే అవకాశం దొరుకుతుంది. ఇక అక్కడ ముల్లంగి విత్తనాలు నాటగానే ఒక నెలరోజుల సమయంలో అవి మొలకెత్తుతాయని పరిశోధకులు చెప్పారు.

 స్టేస్ స్టేషన్‌లో ముల్లంగి పెంపకం

స్టేస్ స్టేషన్‌లో ముల్లంగి పెంపకం

అంతరిక్షంలో ముల్లంగి పెంపకం వినేందుకు కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది జరగబోతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బయాలజీ ప్రొఫెసర్లు స్వాగతిస్తున్నారు. భూమిపై పంటలను ఎలాగైతే పండిస్తామో అంరిక్షంలో కూడా పంటలను అలానే పండించే ప్రయత్నం తప్పుకాదని ఇది సక్సెస్ అయితే చంద్రుడిపైకి వెళ్లేవారు, మార్స్ పైకి వెళ్లేవారికి ఎంతో ఉపయోగకరంగా మారుతుందని మరిన్ని కొత్త విషయాలను కనుగొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

English summary
US' Northrop Grumman's Cygnus spacecraft, named after astronaut Kalpana Chawla, has been launched from NASA's Wallops Flight Facility. It is carrying cargo and supplies to International Space Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X