వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లూటోకు అవతల ఉన్న మంచుకొండ దరికి స్పేస్ క్రాఫ్ట్..అర్రొకొత్‌గా పేరుమార్పు

|
Google Oneindia TeluguNews

నాసా: అంతరిక్షంలో అత్యంత దూరంగా ఉండే అల్టిమా తూలే అనే ఒక కాస్మిక్ ఆబ్జెక్ట్‌ను తొలిసారిగా ఓ స్పేస్ క్రాఫ్ట్ దరిచేరింది. ఇప్పటి వరకు అల్టిమా తూలే అని పిలువబడుతున్న ఈ కాస్మిక్ ఆబ్జెక్ట్ పేరును అర్రొకొత్ అని నాసా పేరు మార్చింది. అర్రొకొత్ అంటే అమెరికన్ పోహటన్ భాషలో ఆకాశం అని అర్థం. అయితే అంతకుముందున్న తూలే అనే పదం నాజీలతో సంబంధం కలిగి ఉండటంతో వివాదం చెలరేగింది.

కొత్త పేరు అమెరికాలోని పొహాటన్ ట్రైబల్స్‌ తెగకు చెందిన పెద్దలనుంచి పుట్టుకొచ్చిందని నాసా వెల్లడించింది. ఈ పేరును మిషన్‌పై పనిచేసిన న్యూహారిజాన్ టీమ్‌లోని వ్యక్తులు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ మరియు ప్లానెట్ సెంటర్‌కు ప్రతిపాదించగా అర్రోకొత్ పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పేరు రావడంతో నాజీలతో ఉన్న వివాదానికి తెరపడినట్లు అయ్యింది.

అంతరిక్షంలో అత్యంత దూరంగా ఉన్న ప్లూటో గ్రహానికంటే దూరంగా మంచుతో కూడిన ఓ పెద్ద కొండ రూపంలో ఉందని అది కూపర్ బెల్టులో ఉన్నట్లు నాసా వెల్లడించింది. అక్కడికే నాసాకు చెందిన ఒక స్పేస్ క్రాఫ్ట్ వెళ్లిందని వివరించింది. స్పేస్ క్రాఫ్ట్ తీసిన ఫోటోలను పరిశీలిస్తే రెండు మంచుతో కూడిన రెండు గోలాలు అతుకున్నట్లుగా ఉందని నాసా వివరించింది. సాంకేతికంగా మాట్లాడితే దాని 2014 MU69గా పిలుస్తామని చెప్పిన నాసా, స్పేస్‌ క్రాఫ్ట్‌లో ప్రయాణించిన టీమ్ దానికి అల్టిమా తూలేగా మొదట్లో నామకరణం చేసింది. ఈ పేరు నాజీలతో సంబంధం కలిగి ఉండటంపై కొంత వివాదం చెలరేగింది.

NASA renames faraway ice world Arrokoth after Nazi Controversy

20వ శతాబ్దంలో జర్మనీకి చెందిన తాంత్రికులు ఆర్యన్ ప్రజలతో అల్టిమా తూలే పేరును ముడిపెట్టడం ఆ తర్వాత అల్టిమా తూలే అనే సమాజం హిట్లర్‌ స్థాపించిన నాజీ పార్టీగా మారడం జరిగింది. నాజీ పార్టీగా మారిన అల్టిమా తూలే ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఇక తాజాగా మంచుతో కూడిన రాయికి అర్రొకొత్ అనే కొత్త పేరుపెట్టారు. అంతరిక్షంకు అవతల ఏముందో స్టడీ చేసేందుకు ప్రేరణగా అర్రొకొత్ అనే పేరును పెట్టినట్లు కొలరాడోలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అలన్ స్టర్న్ తెలిపారు. అర్రొకొత్ పేరు పెట్టేముందు పోహటన్ గిరిజన పెద్దల నుంచి అనుమతి లభించిందని నాసా స్పష్టం చేసింది.

English summary
Ultima Thule, the farthest cosmic body ever visited by a spacecraft, has been officially renamed Arrokoth, or "sky".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X