వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతిపెద్ద ఒంటరి నక్షత్రం, భూమికి చేరాలంటే 900 కోట్ల కాంతి సంవత్సరాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భూమికి వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ నక్షత్రాన్ని హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ నక్షత్రానికి ఇకారస్ అని పేరు పెట్టారు. ఈ నక్షత్రం భూమికి 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఈ నక్షత్రం (బ్లూస్టార్) కిరణాలు భూమిని చేరడానికి 900 కోట్ల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు లెక్కలు వేశారు. గ్రావిటేషనల్‌ లెన్సింగ్‌ టెక్నిక్‌ ఉపయోగించి ఇంత దూరంలో ఉన్న నక్షత్రాన్ని గుర్తించిన ఆస్ట్రోనామర్స్‌ కొత్త రికార్డును సృష్టించారు.

 Nasas Hubble telescope captures image of Icarus, farthest star ever seen

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ప్రొఫెసర్‌ పాట్రిక్‌ కెల్లీ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు.ఒంటరిగా ఉన్న ఇంత పెద్ద నక్షత్రాన్ని చూడటం ఇదే తొలిసారని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఒంటరి గెలాక్సీలను చూడొచ్చని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు.

కానీ ఈ నక్షత్రం మాత్రం మనం అధ్యయనం చేయగల ఒంటరి నక్షత్రం కంటే వంద రెట్ల దూరంలో ఉంది అని కెల్లీ తెలిపారు. గ్రావిటేషనల్‌ లెన్స్‌తోపాటు హబుల్‌ టెలిస్కోప్‌కు ఉన్న అత్యంత శక్తిమంతమైన రెజల్యూషన్‌ సాయంతో ఆస్ట్రోనాట్స్‌ ఇకారస్‌ను అధ్యయనం చేయనున్నారు.

English summary
Nasa's Hubble Space Telescope has discovered the farthest individual star ever seen - an enormous blue stellar body nicknamed Icarus located over halfway across the universe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X