• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాసా మరో విజయం: అంగారకుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ ....తొలి ఫోటో విడుదల

|
  అంగారకుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ : ల్యాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..? | Oneindia Telugu

  కాలిఫోర్నియా: అంతరిక్ష ప్రయోగంలో నాసా మరో విజయం సాధించింది. అంగారకుడిపై ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్న నాసా తాజాగా ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా అంగారకుడిపైకి పంపింది. అంతేకాదు అంగారకుడి పై నుంచి తొలి ఫోటోను తీసి పంపింది. ఈ చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఇక అంగారకుడిపై ల్యాండ్ అయిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆ గ్రహానికి సంబంధించి లోతైన పరిశోధనలు చేపడుతుంది. 1976 వికింగ్ ప్రోబ్ తర్వాత అంగారకుడిపై స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయాలని భావించిన నాసా ఒకసారి తప్ప అన్ని సార్లు విజయం సాధించింది.

  అంగారకుడిపై చేరుకునేందుకు ఆరు నెలల పాటు ప్రయాణం

  అంగారకుడిపై చేరుకునేందుకు ఆరు నెలల పాటు ప్రయాణం

  ఇన్‌సైట్ అనే స్పేస్ క్రాఫ్ట్ రోబో సహాయంతో పనిచేస్తుంది. అంగారకుడి పై లోతైన విశ్లేషణ అక్కడి వాతావరణం ఇతరత్ర అంశాలను స్టడీ చేయనుంది. 2018 మే 5న భూమిపై నుంచి బయలు దేరిన ఈ స్పేస్ క్రాఫ్ట్ నవంబర్ 26వ తేదీన అంగారకుడిని తాకింది. మొత్తం 300 మిలియన్ మైళ్లు ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించింది. అంగారకుడిపై సెస్మోమీటర్, బరోతో పాటు మరో హీట్ ప్రోబ్‌ను ఉంచుతుంది. ఇక అంగారకుడిపై ల్యాండ్ అయిన ఇన్‌సైట్ స్పేస్ క్రాఫ్ట్ పరిశోధనలు ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా అంగారకుడి అంతర నిర్మాణం మార్స్ గ్రహం యొక్క భ్రమణంను తెలుసుకునేందుకు రేడియో సైన్స్ ప్రయోగాలు చేస్తుంది.

  అంగారకుడి పై లోతైన పరిశోధనలు చేసే వీలుంది

  "విజయవంతంగా అంగారకుడిపై ఈరోజు ల్యాండ్ అయ్యాం. ఇది మానవచరిత్రలో ఎనిమిదో సారి "అని నాసా పరిపాలనాధికారి జిమ్ బ్రిడెన్స్‌టైన్ తెలిపారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి, అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలని యోచిస్తున్న నేపథ్యంలో ఇన్‌సైట్ నుంచి వచ్చే సమాచారం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటికే పలు విజయం సాధించిన అమెరికాకు తాజా విజయం మరో తార్కాణంగా నిలవనుందని అన్నారు జిమ్. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నాసా నుంచి మరిని విజయాలు నమోదు కావాల్సి ఉందని చెప్పిన జిమ్.. ఆ విజయాలను త్వరలోనే చూస్తామని చెప్పారు. ప్రయోగం సక్సెస్ కావడంపై అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఫోన్ చేసి తమను అభినందించారని జిమ్ స్పష్టం చేశారు.

  ఇప్పటి వరకు అంటే 1965 నుంచి జరుగుతున్న ప్రయోగాల్లో కేవలం అంగారకుడిని కక్ష్య నుంచి మాత్రమే స్టడీ చేయగలిగామని, దాని పరిసరాల్లో వాతావరణం, భూగర్భ శాస్త్రం, ఉపరితల కెమెస్ట్రీని మాత్రమే స్టడీ చేసే అవకాశం లభించిందని...ఇప్పుడు అంగారకుడిపైనే ల్యాండ్ అవడంతో ఆ గ్రహంపైన ప్రతి అంశాన్ని లోతుగా పరిశోధన చేసే వీలుంటుందని అన్నారు నాసా విభాగానికి చెందిన మరో అధికారి లోరి గ్లేజ్.

  ల్యాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?

  ల్యాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?

  రెండేళ్ల పాటు అంగారకుడిపై ఉండనున్న ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పటికిప్పుడే పరిశోధనలు ప్రారంభించదు. రెండు నుంచి మూడు నెలల సమయం తీసుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారకుడిపై పరికరాలను దించేందుకు రోబో ఈ సమయం తీసుకుంటుందన్నారు. ఈ సమయంలో శాస్త్రవేత్తలు అక్కడి పరిస్థితులపై ఫోటోలను తీసి వాటిని పరిశీలించడం జరుగుతుంది. అయితే స్పేస్ క్రాఫ్ట్‌కు అమర్చిన ఏడడుగుల సోలార్ రెక్కలు సురక్షితంగా తెరుచుకున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. బ్యాటరీలు కూడా రీచార్జ్ అవుతున్నట్లు వారు చెప్పారు.

  English summary
  NASA's InSight spacecraft landed on Mars to explore the deep interior of the Red Planet. It was NASA's ninth attempt to land at Mars since the 1976 Viking probes. All but one of the previous U.S. touchdowns were successful.InSight is a robotic lander designed to study the interior of the planet Mars. The mission launched on 5 May 2018 at 11:05 UTC and landed on the surface of Mars at Elysium Planitia on 26 November 2018, at approximately 2:54 pm ET after a journey of nearly 300 million miles, where it will deploy a seismometer and burrow a heat probe.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X