వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా మార్స్ 2020 మిషన్: తొలి పారాచూట్ టెస్ట్ విజయవంతం

2020లో చేపట్టనున్న మార్స్ రోవర్ మిషన్ కోసం నాసా పరీక్షించిన తొలి సూపర్ సోనిక్ ల్యాండింగ్ పారాచూట్ టెస్ట్ విజయవంతమైంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: 2020లో చేపట్టనున్న మార్స్ రోవర్ మిషన్ కోసం నాసా పరీక్షించిన తొలి సూపర్ సోనిక్ ల్యాండింగ్ పారాచూట్ టెస్ట్ విజయవంతమైంది. అంగారక గ్రహం వాతావరణంలోకి స్పేస్ క్రాఫ్ట్‌ ప్రవేశించగానే దాని వేగాన్ని తగ్గించి నెమ్మదిగా ఆ గ్రహ ఉపరితలంపై సురక్షితంగా దించేందుకు ఈ ప్రత్యేక పారాచూట్‌ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఈ పారాచూట్‌ సెకనుకు 5.4 కి.మీ వేగంతో కిందికి దిగనుంది.

అంగారక గ్రహంపై జీవం ఉనికికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు మార్స్ 2020 మిషన్‌ను నాసా చేపడుతోంది. ఇందుకోసం సూపర్ సోనిక్‌ వేగంతో ల్యాండ్‌ అయ్యే పారాచూట్‌ పరీక్షను చేపట్టింది.

రాకెట్ ప్రయోగం

రాకెట్ ప్రయోగం

ఆస్పైర్‌(అడ్వాన్స్‌డ్‌ సూపర్‌సోనిక్‌ పారాచూట్‌ ఇన్‌ఫ్లేషన్‌ రీసెర్చ్‌ ఎక్సిపరిమెంట్‌) పేరిట నిర్వహించిన ఈ ప్రయోగానికి 17.7 మీ. పొడవు ఉన్న సౌండింగ్‌ రాకెట్‌ను నాసా అమెరికాలోని గొడ్డార్డ్‌ స్సేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించింది.

పారాచూట్ తెరుచుకుంది

పారాచూట్ తెరుచుకుంది

ఇది 42 సెకన్ల అనంతరం 51 కిమీ ఎత్తులోకి చేరుకోగానే అందులో ఉన్న పారాచూట్‌ తెరుచుకోవడం ప్రారంభించింది. 32 నిమిషాల తర్వాత ఇది అట్లాంటిక్‌ మహాసముద్రంలో దిగింది. మిషన్‌ డిజైన్‌కు తుది రూపం ఇచ్చేందుకు ఈ ప్రయోగం ద్వారా సేకరించిన సమాచారం ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు.

మార్స్ గురించి తెలుసుకునేందుకు

మార్స్ గురించి తెలుసుకునేందుకు

మార్స్ గురించి తెలుసుకునేందుకు నాసా స్పేస్ క్రాఫ్టును, రోబోట్లను ఉపయోగించింది. 1965లోమారినర్ 4 నాసా ప్రయోగించిన తొలి స్పేస్ క్రాఫ్ట్. 1976లో వికింగ్ 1, వికింగ్ 2లు మార్స్ పైన దిగిన తొలి స్పేస్ క్రాఫ్టులు. అప్పటి నుంచి పలు స్పేస్ క్రాఫ్టులు మార్స్ వద్దకు వెళ్లాయి మరియు ల్యాండ్ అయ్యాయి.

నీటి జాడలను గుర్తించాయి

నీటి జాడలను గుర్తించాయి

నాసా స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ రోవర్స్ 2004 జనవరిలో మార్స్ పైన ల్యాండ్ అయ్యాయి. అక్కడ నీటి జాడలను గుర్తించాయి. ప్రస్తుతం మార్స్ చుట్టూ మూడు ఎయిర్ క్రాఫ్ట్స్ తిరుగుతున్నాయి. ఇవి ఫోటోలు కూడా తీస్తున్నాయి.

అందుకోసం రోబోట్లను పంపించేందుకు

అందుకోసం రోబోట్లను పంపించేందుకు

నాసా మరిన్ని రోబోట్లను మార్స్ పైకి పంపించే ప్రయత్నాలు చేస్తోంది. ఇవి మార్స్ పైన ఉన్న మట్టి, రాళ్లు తదితరాల వాటిని తీసుకువస్తే, వాటిని స్టడీ చేసేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. 2014 సెప్టెంబర్ నుంచి మావెన్ స్పేస్ క్రాఫ్ట్ మార్స్ చుట్టూ తిరుగుతోంది. ఇది అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేస్తోంది. కొత్త మార్స్ రోవర్‌ను 2020కి పంపించాలని భావిస్తోంది.

English summary
Ahead of its Mars rover mission set to be launched in 2020, NASA has successfully tested a supersonic landing parachute that will slow the spacecraft down as it enters the Martian atmosphere at over 5.4 kilometres per second.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X