వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా సరికొత్త యాప్: వ్యోమగామిలా గెలాక్సీ ఎదుట మీరు ఇలా సెల్ఫీ తీసుకోవచ్చు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: నాసా తాజాగా రెండు యాప్‌లను రూపొందించింది. అందులో ఒకటి సెల్ఫీలు తీసుకునే యాప్. మరొకటి ఎక్సోప్లానెట్ ఎక్స్‌కర్షన్ వీఆర్ యాప్. మొదటి యాప్‌తో నక్షత్ర మండలాలతో సెల్ఫీ తీసుకున్న అనుభూతి పొందవచ్చు. రెండో యాప్‌తో ఐదు గ్రహాలను మనం చుట్టిరావొచ్చు. అక్కడి అద్భుత వెలుగులను, చీకటిలను చూడవచ్చు.

ఆసక్తి కలిగిన వారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఓ వ్యోమగామిలా గెలాక్సీ (నక్షత్ర మండలం) బ్యాక్ డ్రాప్‌తో సెల్ఫీ తీసుకోవచ్చు.

 NASA Selfies app launched: Heres how to take an astronaut like selfie with the galaxy in the backdrop

నాసా సెల్ఫీ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లు ఉపయోగించి, ఆసక్తి కలిగిన వారు విశ్వంలోని నక్షత్ర మండలం ముందు ఫోటో దిగినట్లుగా ఫోటో తీసుకోవచ్చు. యూజర్లకు ఆసక్తి ఉంటే వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా షేర్ కూడా చేసుకోవచ్చు.

వర్చువల్‌ రియాలిటీ పరిజ్ఞానంతో నాసా దీనిని అభివృద్ధి చేసింది. స్పిట్జర్ స్పేస్‌ టెలిస్కోప్‌ను ప్రయోగించి శనివారంతో పదిహేనేళ్లు పూర్తవుతుంది. దీంతో ఈ టెలిస్కోప్‌ తీసిన చిత్రాలతో తాజా యాప్‌ను రూపొందించింది. దీనికి సెల్ఫీస్‌ యాప్‌గా నామకరణం చేసింది.

దీని సాయంతో సెల్ఫీలు తీసుకొంటే మన వెనుక గెలాక్సీలు కనిపిస్తాయి. ఈ చిత్రాల వెనుక కథలను వివరించడం ఈ యాప్‌ ప్రత్యేకత. కళ్లను కట్టిపడేసే ముప్పై నక్షత్ర మండలాల చిత్రాలు ఈ యాప్‌లో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఇతర టెలిస్కోప్‌లు తీసిన చిత్రాలను వీటికి జత చేయనున్నారు.

English summary
NASA has created two virtual reality apps that allow users to take selfies in front of gorgeous cosmic locations, and explore TRAPPIST-1 planetary system, the only known exoplanet system to host seven roughly Earth size planets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X