వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019లో భూమిపై జరిగిన అద్భుతాలను వీడియోగా విడుదల చేసిన నాసా

|
Google Oneindia TeluguNews

2019వ సంవత్సరం ఎన్నో ఘటనలకు సాక్షిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విజయాలు 2019లో నమోదయ్యాయి. అంతరిక్షరంగం వరకు చూసుకుంటే చంద్రయాన్ 2 నుంచి నాసా చేపట్టిన పలు పరిశోధనలకు 2019వ సంవత్సరం వేదికగా నిలిచింది. ఇక భూమికి సంబంధించిన అనేక విషయాలు రహస్యాలు గత 2019వ సవంత్సరంలోనే వెలుగు చూశాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎన్నో అంతరిక్ష అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేసింది. నాసాకు చెందిన ఉపగ్రహాలు తీసిన ఫోటోలు, వ్యోమగాములు తీసిన ఫోటోలు భవిషత్యులో మరిని ప్రయోగాలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

నాసా విడుదల చేసిన వీడియో

భూమిపై జరుగుతున్న విషయాలను నాసాకు చెందిన ఉపగ్రహాలు, వ్యోమగాములు తీసిన ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. భూమిపై ఆయా దేశాల్లో జరిగిన సహజ విపత్తులను ఫోటోలుగా తీసి ఒక వీడియోలా తయారు చేసి విడుదల చేసింది నాసా. ఈ వీడియోను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలతో పాటు అనేక మంది ప్రజలు వీక్షించారు. నాసా చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నంను అంతా స్వాగతించడమే కాకుండా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.

అద్భుతమైన దృశ్యం లీనా రివర్ డెల్టా

అద్భుతమైన దృశ్యం లీనా రివర్ డెల్టా

కురిల్ దీవుల్లో 1994 తర్వాత తొలిసారిగా రైకోకే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఆర్కిటిక్ మహాసముద్రంకు ఈశాన్య ప్రాంతంలో ఉన్న లీనా రివర్ డెల్టాపై ఏడాదిలో సగానికి పైగా మంచుతో గడ్డకట్టి ఉంటుంది. ఇక అతి తక్కువ కాలం ఉండే వేసవిలో మంచు కరిగి అందులోని నీరు ప్రవహించి తిరిగి మళ్లీ గడ్డకట్టే సుందరమైన దృశ్యాన్ని నాసా ఉపగ్రహాలు ఫోటోలు తీశాయి.

 వేసవిలో ఒక భాగం మంచు గడ్డ కరిగిని దృశ్యం

వేసవిలో ఒక భాగం మంచు గడ్డ కరిగిని దృశ్యం

ఎప్పుడూ మంచు గడ్డలు కనిపించే గ్రీన్‌ల్యాండ్‌లో వేసవి సమయంలో ఒక భాగం కరిగి మరో భాగం భూమి కనిపించే సుందరమైన దృశ్యంను నాసాకు చెందిన సైంటిస్టు జాన్ సాన్‌టాగ్ గతేడాది సెప్టెంబర్ 4వ తేదీన ఫోటో తీశారు. నాసా చేపట్టిన ఆపరేషన్ ఐస్ బ్రిడ్జ్‌లో భాగంగా ఈ ఫోటోలను తీయడం జరిగింది.

 లావా పొంగుతూ ఒక సరస్సును తలపించిన దృశ్యం

లావా పొంగుతూ ఒక సరస్సును తలపించిన దృశ్యం

కంటికి కనిపించని చాలా ప్రాంతాలు భూమిపై ఇంకా దాగి ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని శాండివిచ్‌ దీవులు. ఇక్కడ మౌంట్ మైఖేల్ అగ్నిపర్వతం నుంచి లావా పొంగి పొర్లుతూ ఒక చిన్న సరస్సులా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని నాసా ఉపగ్రహాలు ఫోటోలు తీశాయి.

 సముద్ర గర్భంలో బయటపడ్డ కొత్త దీవి

సముద్ర గర్భంలో బయటపడ్డ కొత్త దీవి

పసిఫిక్ మహా సముద్రంకు నైరుతీ దిక్కున సముద్రగర్భంలో ఏర్పడ్డ విస్ఫోటనంతో టాంగా చైన్‌లో మరో అగ్నిపర్వతం ఉందన్న విషయాన్ని కనుగొనడం జరిగింది. ఆపరేషన్ ల్యాండ్ ఇమేజర్‌లో భాగంగా ల్యాండ్‌శాట్ 8 ద్వారా ఈ ఫోటోలను తీయడం జరిగింది. అక్టోబర్ 16, 2019లో ఈ విస్ఫోటనం జరిగి కొత్త అగ్నిపర్వతంను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు

అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు

మొత్తానికి ఈ కొన్ని మాత్రమే కాదు చాలా అద్భుతాలను నాసా ఫోటోలు తీసి ఒక వీడియోలా చేసి విడుదల చేసింది. ఇదాయ్ తుఫాను సృష్టించిన బీభత్సం, మిస్సిసిపీ నదికి పోటెత్తిన వరదలు, 2010 తర్వాత అమెజాన్ అడవులను అగ్ని దహించివేసిన దృశ్యాలు, మానవుడి చర్యల ద్వారా పెరూలో అంతరించిపోతున్న అడవులు, అంతరిక్షం నుంచి రాత్రి వేళల్లో భూమి కనిపించే తీరు లాంటి అద్భుతమైన ఫోటోలతో నాసా వీక్షకులకు కనువిందు చేసింది.

English summary
2019 brought many memorable events on Planet Earth. NASA satellites and astronauts captured a lot of the action from new discoveries to tracking natural events to capturing amazing scenery. Here are a few highlights from around the globe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X