వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా హెచ్చరిక: ఆ రోజే భూమి వైపు 48వేల కిలోమీటర్ల వేగంతో భారీ గ్రహశకలం, మరో 2 కూడా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే.. ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) మరో దిగ్భ్రాంతికర కబురు చెప్పింది.
భూమి వైపు భారీ గ్రహశకలం వస్తుందని, అది ఢీకొనడంతో భూమిపై జీవజాలం అంతమవుతుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు బలం చేకూర్చింది నాసా ప్రకటన,

భూమికి అతి దగ్గరగా గ్రహశకలాలు..

భూమికి అతి దగ్గరగా గ్రహశకలాలు..

జులై 24న ఓ భారీ ఆస్టరాయిడ్(ఉల్క-గ్రహశకలం) భూమికి అతి దగ్గరగా రానుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) హెచ్చరించింది. ఈ భారీ ఆస్టరాయిడ్‌కు ఆస్టరాయిడ్ 2020 ND అనే పేరును పెట్టింది. నాసా. కాగా, ఆదివారంనాడు మన గ్రహంను రెండు గ్రహశకలాలు కూడా దాటనున్నాయి. నాసా ఈ రెండు గ్రహశకలాలలకు 2016 DY30, 2020 ME3 అని పేరు పెట్టింది. ఈ ప్రమాదకర గ్రహ శకలాలు(పీహెచ్ఏస్) భూమికి అతి సమీపంగా రానున్నాయి.

భూమివైపు గంటకు 48000 వేగంతో దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్

భూమివైపు గంటకు 48000 వేగంతో దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్

ఈ ఆస్టరాయిడ్స్ భూమి కక్ష్యలోకి కూడా ప్రవేశించే అవకాశాలున్నాయని తెలిపింది నాసా ప్రకారం . ఆస్టరాయిడ్ 2020 ND 170 మీటర్ల పొడవు ఉంటుంది. 0.034 ఆస్ట్రోనామికల్ యూనిట్స్(5,086,328 కిలోమీటర్లు) దూరంలో ఉంది. అయితే, ఈ గ్రహశకలం గంటకు 48000 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొస్తుండటం గమనార్హం. ఈ వేగంతో ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే భారీ ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. అందుకే దీన్ని ప్రమాదకరమైన ఆస్టరాయిండ్ అని నాసా పేర్కొంటోంది.

మరో ఆస్టరాయిడ్ గంటకు 54000 కిలోమీటర్ల వేగంతో..

మరో ఆస్టరాయిడ్ గంటకు 54000 కిలోమీటర్ల వేగంతో..

2016 DY30 కూడా భూమి వైపునకు గంటకు 54000 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ఇక 2020ME3 కూడా గంటకు 16000 కిలోమీటర్ల వేగంతో మన గ్రహంవైపు వస్తోంది. అయితే, 2016 DY30 అనే ఆస్టరాయిడ్ చాలా చిన్నది. 15 ఫీట్లు మాత్రమే విస్తరించివుంది. నాసాకు చెందిన సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్(సీఎన్ఈఓఎస్) ప్రకారం.. 2016 DY30 భూమికి సమీపంగా రానుంది. 0.02306 ఆస్ట్రోనామికల్ యూనిట్స్(3.4 మిలియన్ కిలోమీటర్లు) మేర భూమికి దగ్గరగా రానుంది. జులై 19 ఉదయం 10.02 గంటలకు పెద్ద ఆస్టరాయిడ్ భూమికి అతి దగ్గరగా రానుంది. సూర్యుని చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి సమీపం నుంచి ఈ ఆస్టరాయిడ్(అపోలో) వెళ్లిపోనుంది.

Recommended Video

Comet NEOWISE : ఈ శతాబ్దానికి మనుషులు చూడగలిగే మొట్టమొదటి తోకచుక్క.. 20 రోజులపాటు క్లియర్‌గా!
జులై 21న మరో గ్రహ శకలం భూమికి దగ్గరగా..

జులై 21న మరో గ్రహ శకలం భూమికి దగ్గరగా..


2020 ME3 ఆస్టరాయిడ్ జులై 21 తెల్లవారుజామున 02.51 గంటలకు భూమికి సమీపానికి రానుంది. ఆ సమయంలో చిన్న ఆస్టరాయిండ్‌కు భూమికి మధ్య దూరం సమారు 0.03791 ఆస్ట్రానామికల్ యూనిట్స్(5.6 మిలియన్ కిలోమీటర్లు) ఉండనుంది. అమోర్ ఆస్టరాయిడ్‌గా ఈ గ్రహశకలం పలుమార్లు భూమికి సమీపంలోకి వస్తుంది కానీ భూమిపైకి రాదని తెలిపింది. ఈ రెండు ఆస్టరాయిడ్లు కూడా భూమికి అంత ప్రమాదకరం కాదని నాసా వెల్లడించింది. ఈ ఖగోళ వస్తువులు ఇతర గ్రహాల గురుత్వాకర్షణ ఆకర్షణల వల్ల మన సౌర వ్యవస్థకు సమీపంలో ఉండటం వల్ల నాసా ఇలాంటి వస్తువులను భూమికి సమీపంలో ఉన్న వస్తువులుగా వర్గీకరిస్తుంది.

English summary
National Aeronautics and Space Administration (NASA) has issued a warning that a huge asteroid “Asteroid 2020 ND” will move past Earth on July 24. There is also information of two asteroids that are expected to whiz past our planet on Sunday. The two asteroids named by NASA are 2016 DY30 and 2020 ME3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X