వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు మరో ముప్పు! తరుముకొస్తున్న నేట్ హరికేన్, లూసియానాలో ఎమర్జెన్సీ..

హార్వే, ఇర్మా, మారియా హరికేన్‌ల దెబ్బ నుంచి కోలుకోకముందే అమెరికాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. మధ్య అమెరికాలో బీభత్సం సృష్టించిన నేట్‌ తుఫాన్‌.. గల్ఫ్‌ తీరం వైపు దూసుకెళ్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హార్వే, ఇర్మా, మారియా హరికేన్‌ల దెబ్బ నుంచి కోలుకోకముందే అమెరికాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. మధ్య అమెరికాలో బీభత్సం సృష్టించిన నేట్‌ తుఫాన్‌.. గల్ఫ్‌ తీరం వైపు దూసుకెళ్తోంది.

ఆదివారం నాటికి అది హరికేన్‌గా బలపడి లూసియానాలోని న్యూఓర్లేన్స్‌ దగ్గర తీరం దాటే అవకాశమున్నట్లు నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో 38 నుంచి 50 సెం.మీ. మేర కుండపోత వర్షాలు కురుస్తాయని, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.

Nate upgraded to Category 1 hurricane, takes aim at US Gulf Coast

నేట్‌ తుఫాన్‌ హరికేన్ గా మారనున్న నేపథ్యంలో లూసియానా స్టేట్‌లో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.

నేట్‌ తుఫాన్‌ కారణంగా గల్ఫ్‌ తీరంలోని 15 చమురు బావుల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అంతకుముందు సెంట్రల్‌ అమెరికాలో నేట్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చాలా నగరాలు అంధకారంలోనే ఉన్నాయి.

నేట్‌ ధాటికి నికరాగ్వాలో 15 మంది, కోస్టారికాలో ఏడుగురు మరణించగా, మరో 15 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. 7 వేల మందికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు.

English summary
Tropical Storm Nate was upgraded Friday at 11:30 p.m. ET to a Category 1 hurricane with estimated maximum winds of 75 mph, the National Hurricane Center announced. Nate's location was about 95 miles WNW of the western tip of Cuba, and about 495 miles SSE of the mouth of the Mississippi River. It was moving at NNW at 22 mph, the National Hurricane Center said. "An Air Force Reserve Hurricane Hunter aircraft just penetrated the center of Nate and reported the hurricane-force winds," read the National Hurricane Center bulletin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X