వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడిపై షరీఫ్ ఆగ్రహం: గత మూడేళ్లో ఇవీ దాడులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బచాఖాన్ విశ్వవిద్యాలయం పైన ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడి ఘటన పైన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. ఈ దాడి పైన ఆయన ఘాటుగా స్పందించారు. దీనిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు మతమే లేదని వ్యాఖ్యానించారు.

అమాయకులైన విద్యార్థులు, పౌరులను చంపేస్తున్న ఉగ్రవాదులలకు మతంగాని, విశ్వాసంగాని లేదని చెప్పారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ భూభాగం నుంచి తరిమికొట్టేందుకే నిర్ణయం తీసుకున్నామన్నారు. లెక్కలేనంత మంది దేశ పౌరుల త్యాగాలను వృథా కానివ్వబోమన్నారు. మరోవైపు, ఈ దాడిని తామే చేశామని తెహ్రీక్ ఈ తాలిబన్ ప్రకటించింది.

 Nawaz Sharif condemns terrorist attack at Pakistan university

పాకిస్థాన్‌‌లో ఉగ్రవాద దాడులు...

పాక్‌లో ఉగ్రవాదుల దాడులు ఏళ్లుగా కొనసాగుతోంది. వివిధ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో విచక్షణారహిత దాడులకు తెగబడి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా బచాఖాన్‌ యూనివర్సిటీపై తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ దాడులకు తెగబడింది.

గత మూడేళ్లలోనే వందలాది మంది ప్రజలు ఉగ్రదాడికి బలయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తుందనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఉగ్రవాదానికి ఊతం ఇచ్చిన పాకిస్తాన్.. ఇప్పుడు అదే బలవుతోందని చాలామంది భావిస్తున్నారు.

2016 జనవరి 19: పెషావర్లో ఓ చెక్‌పోస్ట్‌ వద్ద బాంబు పేలుడు, 11 మంది మృతి.
2015, జనవరి 30: షియా మసీదు వద్ద పేలుడు, 53 మంది మృతి.
2015, ఫిబ్రవరి 13: పెషావర్‌లోని షియా మసీదు వద్ద తాలిబన్ల దాడి, 19 మంది మృతి.
2015, మే 13 : కరాచీలో బస్సుపై దాడి, 46 మంది మృతి.
2015, మే 29: మస్టుంగ్‌ ప్రాంతంలో బస్సుపై ఉగ్రవాదులు దాడి, 23 మంది మృతి.
2015, అక్టోబరు 19: బెలూచిస్థాన్‌లో దాడి, 11 మంది మృతి.
2014, ఏప్రిల్‌ 9: ఇస్లామాబాద్ మార్కెట్‌లో దాడి, 24 మంది మృతి.
2014 జూన్‌ 8: బెసూచిస్థాన్‌లో బస్సుపై దాడి, 24 మంది మృతి.
2014 జూన్‌ 8: కరాచీలోని జిన్నా విమానాశ్రయంపై దాడి, 30 మంది మృతి.
2014 నవంబరు 2: భారత్‌-పాక్‌ సరిహద్దులోని వాఘా సరిహద్దులో దాడి. 60 మంది మృతి.
2014 డిసెంబరు 16: పెషావర్‌లోని స్కూల్‌పై దాడి. 132 మంది చిన్నారులు సహా 141 మంది మృతి.
2013 జనవరి 10: స్వాత్‌ లోయ, క్వెట్టా ప్రాంతాల్లో బాంబు దాడులు. 100 మంది మృతి.
2013, ఫిబ్రవరి 16: క్వెట్టాలోని ర్కెట్‌లో దాడి, 91 మంది మృతి.
2013 సెప్టెంబరు 22: పెషావర్‌ చర్చి వద్ద ఆత్మాహుతి దాడి, 78 మంది మృతి.

English summary
Nawaz Sharif condemns terrorist attack at Pakistan university; Tehreek-e-Taliban claims responsibility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X