వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చౌదరి షుగర్ మిల్స్ కేసులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అరెస్టు

|
Google Oneindia TeluguNews

లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో అరెస్టు చేసింది. చౌదరి షుగర్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్‌ను అరెస్టు అయ్యారు. అంతకుముందు అంటే ఆగష్టు 8వ తేదీన ఇదే కేసు విషయంలో నవాజ్ షరీఫ్ కుమార్తె మరయం అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆమె జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. షుగర్ మిల్స్‌లో వాటాల కొనుగోలు సమయంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు షరీఫ్ పై అతని కుటుంబ సభ్యులపై నమోదయ్యాయి. షరీఫ్‌కు ఇందులో ప్రధాన పాత్ర ఉందని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో తేల్చింది. ఇక మరియంకు 12 మిలియన్ షేర్లు ఉన్నట్లు బ్యూరో గుర్తించింది.

కోట్‌ లాక్‌పథ్ జైలులో ఉన్న నవాజ్ షరీఫ్‌ను ఎన్ఏబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అల్ అజీజా కేసులో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం . ప్రస్తుతం ఆయన్ను లాహోర్‌లోని అకౌంటబులిటీ కోర్టులో హాజరుపర్చారు. 2016లో చౌదరి షుగర్ మిల్స్‌లో అత్యధిక వాటాదారుడిగా నవాజ్ షరీఫ్ ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఎన్ఏబీ తరపున లాయర్ హఫీజ్ అసదుల్లా అవాన్. షమీమ్ షుగర్ మిల్స్‌లో కూడా ఆయనకు షేర్లు ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. పూర్తి సమాచారం పొందేందుకు షరీఫ్‌ను 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఏబీ కోర్టును కోరింది.

Nawaz Sharif faces tough time, arrested in Chaudhry Sugar mills case

చౌదరి షుగర్ మిల్స్‌లోకి నిధులు ఓ విదేశీ సంస్థ నుంచి వచ్చినట్లు ఎన్ఏబీ గుర్తించింది. 1992లో ఓ విదేశీ సంస్థ నవాజ్ షరీఫ్‌కు రూ.55.5 మిలియన్లు ఇచ్చిందని పేర్కొంది. అయితే ఈ విదేశీ సంస్థకు యజమాని ఎవరో ఇప్పటికీ గుర్తించలేకపోయినట్లు అవాన్ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే చట్టానికి వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్ అరెస్టు ఉందని అతని తరపున వాదించిన లాయర్ చెప్పారు. విచారణ చేయాలంటే జైలు ప్రాంగణంలోనే చేయాలని లాయరు కోర్టును కోరారు. ఒక్క గంట కూడా ఎన్ఏబీ కస్టడీకి షరీఫ్‌ను అప్పగించరాదని వాదించారు అమ్జద్ పర్వేజ్. వాదనలు విన్న న్యాయస్థానం నవాజ్ షరీఫ్‌ను 14 రోజుల పాటు ఎన్ఏబీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 25కు విచారణను వాయిదా వేసింది కోర్టు.

English summary
Former prime minister Nawaz Sharif was arrested in the Chaudhry Sugar Mills case by the National Accountability Bureau (NAB) on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X