వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ మాజీ ప్రధానిపై విషప్రయోగం..! నవాజ్ షరీఫ్ శరీరంలో పొలోనియమ్..!!

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అరోగ్యంపై ఆ దేశానికి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నవాజ్‌షరీఫ్‌ను చంపేందుకు కుట్ర జరిగిందని..దీంతో ఆయన శరీరంలో పోలోనియమ్ అనే విషపదార్థాన్ని ఎక్కించారని పాకిస్తాన్‌కు చెందిన ముత్తాహిదా ఖౌమి మూవ్‌మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుసేన్ ఆరోపణలు చేశాడు. పోలొనియంతో పాలస్తినా ఉద్యమకారుడు యాసర్ ఆరాఫత్‌తో పాటు నొబెల్ అవార్డుగ్రహితా మేడమ్ క్యూరీ కూతురు అయిన ఇరెన్ జోలియట్ క్యూరీని ఇలాగే చంపివేశారనే ఉదహారణలు సైతం ఆయన చెప్పారు.

పొలోనీయం ఎఫెక్ట్...

పొలోనీయం ఎఫెక్ట్...

అయితే నవాజ్‌షరీఫ్ శరీరంలో పోలోనియమ్‌ను కనుక్కునేందుకు అంతర్జాతీయంగా ప్రత్యేక ప్రయోగశాలలో మాత్రమే ఈ అంశాన్ని కనుగునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. శరీరంలో పోలోనియం జొప్పించిన తర్వాత మార్పుల్లో జరిగే పరిణామాలపై తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా పోలోనియమ్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా రక్త కణాలను నాశనం చేస్తుందని , ఆ తర్వాత డీఎన్‌ఏపై దాడి చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుందని చెప్పారు. ఆ తర్వాత లీవర్ , కిడ్నీ, ఎముక గుజ్జులను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. అయితే ఎవరు విష ప్రయోగం చేశారనే విషయాన్ని ఆయన వెలువరించలేదు.

ఆనారోగ్యంతో నవాజ్ షరీఫ్‌కు బెయిల్

ఆనారోగ్యంతో నవాజ్ షరీఫ్‌కు బెయిల్

కాగా అనారోగ్యం కారణంతో లాహోర్‌లోని కోట్‌ లక్‌పత్‌ జైల్లో ఖైదును అనుభవిస్తున్న నవాజ్‌ షరీఫ్‌ను అక్టోబర్‌ 22న లాహోర్‌లోని సర్వీస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మరోవైపు కోర్టు కేసుల్లో విచారణ ఎదుర్కోంటున్న నవాజ్ షరీఫ్‌కు ఆక్టోబర్ 29న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మలు మార్లు తీవ్ర ఆనారోగ్యానికి గురైయ్యారు. దీంతో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కాగా ఆయన ఆరోగ్యంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఆరా తీశారు.

ఇంటివద్ద ఐసీయూలో నవాజ్ షరీఫ్

ఇంటివద్ద ఐసీయూలో నవాజ్ షరీఫ్

అయితే ఆసుపత్రిలో మెరుగైన చికిత్సా పోందుతున్న నవాజ్ షరీఫ్‌కు ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో చికిత్స అందించారు. ఇక పూర్తి చికిత్స తీసుకోకుండానే ఆయన్ను స్వగృహం ఉమ్రాకు తీసుకువెళ్లారు. దీంతో నివాసంలో వ్యక్తిగత వైద్యుని పర్యవేక్షణలోనే వైద్యం అందిస్తున్నారు. ఇందుకోసం ఇంట్లోనే ఐసీయూను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక ఇంట్లోకి కూడ ఎవ్వరిని అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాగా నవాజ్ షరీఫ్ అనారోగ్యంపాలు కాకముందు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడ జరిగింది. కాని ఈలోపే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

English summary
former Pakistan Prime Minister Nawaz Sharif has been given polonium,Muttahida Qaumi Movement (MQM) founder Altaf Hussain has claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X