వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాజీల బంగారు రైలు: సొరంగంలో వేట

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: నాజీల కాలం నాటి రోజుల్లో రైలు బోగీల అన్నింటిలో బంగారం నింపి సొరంగంలో పాతి పెట్టారని చరిత్ర చెప్పడంతో గుప్త నిధుల వేటగాళ్లు ఆ రైలు కోసం గాలిస్తున్నారు. శక్తి వంచన లేకుండా బంగారం ఉన్న రైలును సొంతం చేసుకోవాలని చాల మంది ప్రయత్నిస్తున్నారు.

గుప్త నిధుల వేట కొనసాగించే ప్రొఫెసర్ పియోర్ కోపర్, ఆండ్రూస్ రిచెర్డ్ అనే ఇద్దరు వ్యక్తులు చాల కాలం నుంచి బంగారం ఉన్న రైలు కోసం గాలిస్తున్నారు. ఇదే సందర్బంలో వారు పోలాండ్ లోని వాల్ బ్రిక్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఓ వంతెన వద్ద తవ్వకాలు చేపట్టారు.

వారు వెతికిన చోట సొరంగ మార్గం కనిపించింది. అయితే అందులో బంగారం ఉన్న రైలు కనపడకపోవడంతో కొంత నిరాశ చెందారు. రెండో ప్రపంచ యుద్దకాలంలో నాజీలు తమ భవిష్యత్తు అవసరాల కోసం బంగారం నింపిన ఓ రైలును సొరంగంలో ఎవ్వరికీ కనిపించకుండా పాతి పెట్టారు.

Nazi gold hunt shrouded in mystery, no evidence of train

నాజీలు బంగారం ఉన్న రైలును పాతి పెట్టారని చరిత్ర చెబుతున్నది. ప్రత్యేక పరిశీలకులు, నిపుణులను పిలిపించి ఆ ప్రాంతం మొత్తాన్ని రాడార్ల సహాయంతో స్కానింగ్ చేయించారు. అక్కడ ఓ టెన్నల్ ఉందని వెలుగు చూసింది.

అయితే అక్కడ రైలు ఉన్నట్లు మాత్రం కనడటం లేదని అంటున్నారు. అయినా సరే ఆ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ఎలాగైనా సొరంగంలో బంగారం ఉన్న రైలును కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

English summary
The location of a rumoured Nazi gold train remains a mystery after experts ruled a Polish town out of the search.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X