వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘గోల్డ్ ట్రైన్’: మాకంటే! మాకంటున్న రష్యా, పోలాండ్

|
Google Oneindia TeluguNews

పోలాండ్: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మాయమై, పోలాండులో కనుగొనబడినట్టు చెబుతున్న 'నాజీ గోల్డ్ ట్రైన్' తమకే చెందాలని రష్యా కోరనున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎస్ఆర్ సామ్రాజ్యంలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి జర్మన్ దళాలు ఈ రైలును దొంగిలించుకుని పోయాయి.

దశాబ్దాల తరబడి వెలుగులోకి రాకుండా ఉండిపోయిన ఈ రైలును పోలాండ్‌లోని పర్వత సొరంగాల్లో తాము గుర్తించినట్టు నిధుల అన్వేషకులు తెలిపారు.ఈ రైలు తమదే కాబట్టి తమకు చెందాలన్న వాదన వినిపించేందుకు రష్యా అంతర్జాతీయ న్యాయస్థాన నిపుణుల సలహాలు కోరుతుండగా.. తమ దేశంలో ఈ రైలు దొరికినట్లయితే, అది తమ సంపదే అవుతుందని పోలాండ్ మంత్రి పియార్ట్ జుచూవ్ స్కీ వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని, తమ న్యాయవాదులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. రైలును రష్యాకు ఇచ్చే అవకాశాలే లేవని ఆయన తేల్చి చెప్పారు.

Nazi 'gold train' found in Poland could be claimed by Russia

ఇంతకుముందు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఏడు దశాబ్దాల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తుపాకులు, భారీ బంగారు నిధితో బయల్దేరి మార్గమధ్యంలో మాయమైన నాజీ రైలుని కనుగొన్నామని ఇద్దరు వేటగాళ్లు ప్రకటించారు. 1945లో హంగేరీ నుంచి జర్మనీలోని బెర్లిన్‌కు ఒక రైలు బయల్దేరింది.

హిట్లర్ నాజీ సైనికులు ఈ రైలులో భారీఎత్తున తుపాకులు, పారిశ్రామిక పరికరాలు, వజ్రాలు, టన్నుల కొద్దీ బంగారం, ఇతర అమూల్యమైన వస్తువులు, చిత్రపటాలు, కళాకండాలు, బంగారు వెండి ఆభరణాలను ఉన్నట్లు చెప్తున్నారు. వీటి విలువ దాదాపు రూ.13 వందల కోట్ల విలువ ఉంటుందని అంచనా.

English summary
Treasure contained in a long-lost Nazi ghost train could be claimed by Russia. A Russian lawyer has said that the Kremlin could lay claim to the valuables as compensation for the country's losses in the Second World War.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X