వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర కలి: దంతాల కోసం 100 ఏనుగుల ఊచకోత

|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌బర్గ్: ఆఫ్రికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. బోట్స్వానాలో ఏకంగా వంద ఏనుగులు ఊచకోతకు గురయ్యాయి. వాటి దంతాల కోసమే స్మగ్లర్లు ఈ ఘోరానికి ఒడిగట్టడం గమనార్హం.

ఆకాశమార్గాన జరిపిన సర్వేలో ఏనుగుల కళేబరాలు అడవిలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగితే సుమారు వంద ఏనుగులు విగతజీవులై కనిపించాయి. జూలై 10వ తేదీనుంచి ఈ అన్వేషణ మొదలైంది.

ప్రతిరోజూ ఇంకా కళేబరాలు కనిపిసూనే ఉన్నాయని వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎలిఫెంట్స్ వితౌట్ బార్డర్స్ డైరెక్టర్ మైక్ చేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఆఫ్రికాలో ఇంతఘోరం జరగలేదని ఆయన వాపోయారు. బోట్స్వానా ఫారెస్టు రేంజర్ల నుంచి ఆయుధాలు ఉపసంహరించిన తర్వాత ఊచకోత చోటుచేసుకున్నదని ఆయన తెలిపారు.

Nearly 100 elephants killed in Botswana after rangers disarmed

ఓకవాంగా డెల్టాలోని ప్రసిద్ధ సంరక్షణ కేంద్రంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. డజన్లకొద్దీ ఏనుగులను దుండగులు చంపేశారని బోట్స్వానా టూరిజం మంత్రి షెకేడీ ఖామా ధృవీకరించారు. మిగతా వివరాలేవీ ఆయన వెల్లడించలేదు.

ఆఫ్రికాలో అత్యధిక ఏనుగుల జనాభా (సుమారు 1,35,000) ఉన్నది బోట్స్వానాలోనే. జాంబియా, అంగోలా దేశాల్లో ఏనుగుల జాతిని దాదాపుగా అంతం చేసిన స్మగ్లర్లు ఇప్పుడు బోట్స్వానా మీద పడ్డారని చేజ్ తెలిపారు. ఖడ్గమృగాలకు కూడా ఈ వేటగాళ్ల నుంచి ముప్పు ఎదురవుతోందన్నారు.

English summary
The country used to have a ‘shoot-to-kill’ policy against poachers but now poaching sprees are out of control. Ninety elephant carcasses have been discovered in Botswana with their tusks hacked off, a charity said Tuesday, in what is believed to be one of Africa’s worst mass poaching sprees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X