వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాగన్ గేమ్ : మసూద్ అజార్‌ను మరోసారి వెనకేసుకొచ్చిన చైనా..తెరపైకి కొత్త కథ

|
Google Oneindia TeluguNews

పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ జైషేమహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌‌ను మరోసారి వెనకేసుకొచ్చింది డ్రాగన్ కంట్రీ చైనా. ఇంతకీ చైనా మసూద్‌ను ఎలా వెనకేసుకొచ్చింది...? మసూద్‌ను ఉగ్రవాదిగా పేర్కొనే ముందు ఎలాంటి చర్చ జరగాలని చైనా భావిస్తోంది...?

 ఏపీలో క‌మ‌లం పోటీ చేస్తుందా..? కార్య‌వ‌ర్గ స‌మావేశంలో బీజేపి తీసుకున్ననిర్ణ‌యం పై ఉత్కంఠ‌..!! ఏపీలో క‌మ‌లం పోటీ చేస్తుందా..? కార్య‌వ‌ర్గ స‌మావేశంలో బీజేపి తీసుకున్ననిర్ణ‌యం పై ఉత్కంఠ‌..!!

చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న చైనా

చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న చైనా

జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ ఉగ్రవాది అని ప్రపంచదేశాలు చెబుతుండగా చైనా మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జైషేమహ్మద్ సంస్థ, దాని ఛీఫ్ మసూద్ అజార్‌ పేరును ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో బ్లాక్‌లిస్టులో చేర్చాలని మెజార్టీ శాశ్వత సభ్యదేశాలు కోరుతుండగా చైనా మాత్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు. తాజాగా మసూద్ అజార్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్ర వేసేముందు ఓ చర్చ జరిపి ఆ తర్వాత బాధ్యతాయుతమైన పరిష్కారానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడింది డ్రాగన్ కంట్రీ.

యూఎన్ నిబంధనలను చైనా పాటిస్తుంది

యూఎన్ నిబంధనలను చైనా పాటిస్తుంది

ఇక మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఆంక్షలు విధించాలన్న తీర్మానం మార్చి 13న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి 1267 కమిటీ ముందుకు రానున్న నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్‌తో పాటు ఇతర ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాలు మసూద్‌ అజర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని మూడుసార్లు ప్రతిపాదించగా ఆ మూడు ప్రయత్నాలపై చైనా విషం చిమ్మింది. ఇందుకు కారణం ఇస్లామాబాదుతో బీజింగ్ నెరుపుతున్న సత్సంబంధాలే. ఇక రెండు రోజుల్లో ఈ ప్రతిపాదన 1267 ఆంక్షల కమిటీ ముందుకు రానున్న నేపథ్యంలో చైనా వైఖరి గురించి ప్రశ్నించగా చైనా తెలివైన సమాధానం చెప్పుకొచ్చింది. "ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో చాలా నియమాలు నిబంధనలు ఉంటాయి. చైనా వాటిని తప్పకుండా పాటిస్తుంది. బాధ్యతాయుతమైన చర్చ ద్వారానే ఒక పరిష్కారం కనుగొనాలి. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం వస్తుంది" అని చైనా విదేశాంగా ప్రతినిధి లూకాంగ్ తెలిపారు.

 అజార్‌పై కామెంట్ చేసేందుకు చైనా నిరాకరణ

అజార్‌పై కామెంట్ చేసేందుకు చైనా నిరాకరణ

చైనా పాకిస్తాన్‌తో జరిపిన చర్చల్లో మసూద్‌పై నిషేధం విధించాలని పాకిస్తాన్‌ను కోరారా అన్న ప్రశ్నకు కూడా డ్రాగన్ కంట్రీ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. భారత్ పాకిస్తాన్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నామని లూకాంగ్ చెప్పారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తమ శాయశక్తుల ప్రయత్నిస్తున్నామని చెప్పిన లూకాంగ్.. భద్రత అంశంపై కూడా చర్చించామని వెల్లడించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దాడులను ఖండించిన చైనా... ఈదాడులకు ముఖ్య కారణమైన మసూద్ అజార్ పై మాత్రం కామెంట్ చేసేందుకు నిరాకరిచింది.

English summary
China on Monday said it was only through discussions that a “responsible solution” could come out on the issue of listing Pakistan-based Jaish-e-Mohammed (JeM) leader Masood Azhar as a terrorist at the UN Security Council (UNSC).The Chinese foreign ministry’s comment comes in the backdrop of the US, the UK and France moving a fresh proposal at the UNSC to list Azhar as a global terrorist in the aftermath of the JeM claiming responsibility for the suicide attack in Kashmir’s Pulwama on February 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X