• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా కట్టడిలో వైఫల్యం - చైనాపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత- తాజా సర్వేలో వెల్లడి...

|

కరోనా వైరస్‌ ప్రభావం మొదలయ్యాక దాన్ని నియంత్రించడం, ఇతర దేశాలను అప్రమత్తం చేయడం, వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడం ఇలా ఏ ఒక్క అంశంలోనూ చైనా పనితీరు మెరుగ్గా లేదని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనా కట్టడిలో డ్రాగన్‌ దేశం చూపిన నిర్లక్ష్యం భవిష్యత్తులో ఆ దేశంపై ఇతర దేశాల్లో తీవ్ర వ్యతిరేకత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కట్టడిలో చైనా వైఫల్యంపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు మండిపడుతుండగా.. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన తాజా సర్వేలో ఇతర దేశాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం కావడం విశేషం. దీంతో భవిష్యత్తులో చైనా కరోనా విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామం- కరోనా సోకిన ట్రంప్‌తో డిబేట్‌కు బిడెన్‌ నో....అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామం- కరోనా సోకిన ట్రంప్‌తో డిబేట్‌కు బిడెన్‌ నో....

 కరోనా కట్టడిలో చైనా వైఫల్యం...

కరోనా కట్టడిలో చైనా వైఫల్యం...

కరోనా ప్రభావం గతేడాది చివర్లో మొదలైనప్పటికీ దాన్ని ఇతర దేశాలకు పాకకుండా నియంత్రించడంలో చైనా దారుణంగా విఫలమైంది. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో వైరస్‌ తయారైందన్న ప్రచారం ఎలాగో ఉండగా.. ఆ తర్వాత కూడా దాన్ని వ్యాప్తి చేయకుండా చైనా కట్టడి చేయలేకపోయింది. దీంతో ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా బాధితులుగా మారిపోయాయి. కోట్ల సంఖ్యలో జనం కరోనా బారిన పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. మృతుల సంఖ్య కూడా లక్షలు దాటిపోతోంది. అయినా ఇప్పటికీ వైరస్ నియంత్రణ కోసం చైనా చేసిందేమీ లేదు. కనీసం వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు ఇతర దేశాలకు సాయం చేసేందుకు సైతం చైనా ముందుకు రావడం లేదు. దీంతో ప్రపంచ దేశాల్లో డ్రాగన్‌ కంట్రీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ అనే సంస్ధ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో ఇదే విషయం వెల్లడైంది.

 కరోనాను వదిలి భారత్‌తో సరిహద్దు వివాదం...

కరోనాను వదిలి భారత్‌తో సరిహద్దు వివాదం...

ఓవైపు కరోనా ప్రభావం నానాటికీ పెరుగుతున్నా, ఖండాంతరాలకు విస్తరిస్తున్నా దాని రాకకు కారణమైన చైనా మాత్రం అవేవీ పట్టించుకోకుండా భారత్‌తో సరిహద్దు వివాదానికి దిగింది. నెలల తరబడి ప్రతిష్టంభన కొనసాగేందుకు కారణమవుతోంది. చైనా నుంచి ఇప్పటికీ కరోనా పూర్తిగా పోలేదు. అయినా ఇప్పటికీ కరోనా కంటే భారత్‌తో సరిహద్దు వివాదానికే డ్రాగన్‌ దేశం ఎక్కువగా ప్రాధాన్యమిస్తోంది. రక్షణ బడ్జెట్లు పెంచుకుంటూ సరికొత్త ఆయుధాలతో భారత్‌పై ఎలా పోరాడాలా అన్న ఆలోచనతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిైప ప్రపంచదేశాలు మండిపడుతున్నాయి. కరోనాను తమపై రుద్దింది కాక ఇప్పుడు అదేమీ పట్టనట్లుగా భారత్‌తో వివాదాలకు దిగడమేంటనే వాదన ఉపఖండ దేశాల్లో వినిపిస్తోంది.

 చైనా కరోనాను కట్టడి చేసుంటే ...

చైనా కరోనాను కట్టడి చేసుంటే ...

జూన్‌ నుంచి ఆగస్టు మధ్యలో నిర్వహించిన ప్యూరీసెర్చ్‌ సర్వేలో 14 దేశాలకు చెందిన 14,276 మంది పాల్గొన్నారు. కరోనా కారణంగా టెలిఫోన్‌ ద్వారా ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది చైనాను కరోనా విషయంలోనే తప్పుబట్టగా.. మిగతా అంశాల్లోనూ తప్పుబట్టినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. కరోనాను చైనా సమర్ధంగా కట్టడి చేసుంటే తాము బాధిత దేశాలుగా మారే వాళ్లం కాదని అంతర్జాతీయంగా పలు దేశాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూఎస్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్‌, యూకే వంటి దేశాలు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపాయి.

  Top News Of The Day : Kim సంచలన ప్రకటన.. China కు ఉత్తర కొరియా మద్దతు!
   మసకబారిన చైనా ప్రతిష్ట...

  మసకబారిన చైనా ప్రతిష్ట...

  కరోనా వైరస్‌ కట్టడిలో వైఫల్యంతో చైనాతో పాటు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ప్రతిష్ట కూడా గత 12 నెలల్లో మసకబారిందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. అమెరికాలో అయితే ఏకంగా 77 శాతం మంది చైనా అధినేత జిన్‌పింగ్‌పై తమకు నమ్మకం లేదని చెప్పినట్లు సర్వే పేర్కొంది. 14 దేశాల్లో సాగిన ఈ సర్వేలో ఓటేసిన వారిలో అత్యధికులు చైనా పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది కరోనా కట్టడిలో చైనా పనితీరు దారుణంగా ఉందన్నారు. కరోనా విషయంలో చైనా నిర్లక్ష్యం, ఎదుర్కొన్న వైఫల్యాలు అంతర్జాతీయంగానూ ఆ దేశ రేటింగ్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు సర్వే నివేదిక తెలిపింది.

  English summary
  Negative perceptions about China after its failures to handle covid 19 have been rapidly developing in several countries across the world, according to a survey from the Pew Research Center released Tuesday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X