వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24గంటల్లో 6సార్లు కంపించిన నేపాల్: వణికిపోతున్న ప్రజలు

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: ఇటీవల సంభవించిన భారీ భూకంపానికి సుమారు 9వేల మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయిన ఘటన మరువక ముందే.. తాజాగా గురువారం నేపాల్ దేశంలో ఆరుసార్లు భూమి కంపించింది. 4.0 తీవ్రతతో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలు గురువారం ఉదయం 5.29గంటలకు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

జాతీయ భూకంప కేంద్రం(ఎన్ఎస్‌సి) ప్రకారం.. నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌కు ఈశాన్యంలోని
షుఖ్ దోలఖ జిల్లాలో 4.2 తీవ్రతతో మరో స్వల్ప భూకంపం సంభవించింది. అంతకుముందు మరో రెండు భూకంపనాలు సంభవించాయి. గోర్ఖా-ధాడింగ్ మధ్యలో ఉదయం 3.07, 3.40గంటల కాలంలో 4.0 తీవ్రతతో భూకంపం సభవించాయి.

 Nepal continues to shake: 6 mild tremors felt today

దోలఖా వద్ద 4.2 తీవ్రతతో రాత్రి 11.36గంటల ప్రాంతంలో 4.2తీవ్రతతో భూమి కంపించింది. ఏప్రిల్ 25న నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంతో సుమారు 9వేల మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. 21వేల మంది ప్రజలు గాయాలపాలయ్యారు.

7.9 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా, తాజాగా కూడా భూమి తరచూ కంపించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు.

English summary
Six mild tremors jolted Nepal on Thursday, a month after a devastating earthquake ravaged the country and killed nearly 9,000 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X