నేపాల్‌లో తాజాగా రెండు సార్లు భూప్రకంపనలు
ఖాట్మండు: నేపాల్‌లో మళ్లీ భూమి కంపించింది. శుక్రవారం ఉదయం నేపాల్ మధ్య ప్రాంతంలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ మీద వీటి తీవ్రత వరుసగా 4,5గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు.
నేపాల్ మధ్య ప్రాంతంలోని సింధు పాల్ చౌక్, డోలకా జిల్లాల్లో శుక్రవారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతాలలో భూకంప కేంద్రాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత చర్యగా ఆ ప్రాంతంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

గత నెల 25వ తేదీన వచ్చిన భారీ భూకంపం తర్వాత నేపాల్ లో అప్పుడప్పుడు రిక్టర్ స్కేల్ తీవ్రత 4 లేదా అంతకంటే ఎక్కవగా ఇప్పటి వరకు 150 సార్లు భూప్రకంపనలు వచ్చాయని అధికారులు అంటున్నారు.
నేపాల్ లో భూ కంపం వలన మరణించిన వారి సంఖ్య 8 వేలకు పైగా పెరిగింది. సహాయక చర్యలు ఇంకా జరుగతున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!