వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ భూభాగంతో కూడిన కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోదం..వాట్ నెక్ట్స్..?

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండు: గత కొద్ది రోజులుగా నేపాల్ -భారత్ సరిహద్దులపై జగడం కొనసాగుతుండగానే .. నేపాల్ పార్లమెంట్‌లో భారత్‌తో కూడిన సరిహద్దులు కలిగి ఉన్న మ్యాప్‌పై తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. కొత్త మ్యాప్‌లో కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా అనే ప్రాంతాలు ఉన్నాయి. ఆ మూడు ప్రాంతాలు భారత్‌కు చెందుతాయని భారత్ వాదిస్తోంది. నేపాల్ పార్లమెంటులో కొత్త మ్యాప్‌కు ఆమోదం తెలపడంతో భారత్ గుర్రుగా ఉంది. నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్షాలైన నేపాలి కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపడం విశేషం.

షెడ్యూల్‌ 3ని సవరించిన నేపాల్ ప్రభుత్వం

షెడ్యూల్‌ 3ని సవరించిన నేపాల్ ప్రభుత్వం


నేపాల్ రాజ్యాంగంలోని షెడ్యూల్ 3ని సవరిస్తూ ఆ దేశ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. తమ దేశ జాతీయ చిహ్నంలో కొన్ని మార్పులు తీసుకొస్తూ దానిపై ఉన్న మ్యాప్‌ను కూడా మార్చింది. అందులో భారత్‌కు చెందిన సరిహద్దులను కూడా చేర్చింది. ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది. మొత్తం 275 మంది సభ్యులున్న పార్లమెంటులో మూడింట రెండో వంతు మెజార్టీ అవసరం కాగా అది ప్రభుత్వానికి సునాయాసంగా లభించింది. జూన్ 9వ తేదీన నేపాల్ కేబినెట్ కొత్త మ్యాప్‌ను రూపొందించింది. ఇందులో లిపులేఖ్, కాలాపాని మరియు లింపియాధురాలు తన భూభాగంలో చేర్చింది. అప్పటికే భారత్-నేపాల్‌ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. నేపాల్ తన భూభాగంలో చేర్చిన మూడు ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రం కిందకు వస్తాయని భారత్ వాదిస్తోంది.

నేపాల్ చర్య సరైనది కాదు

నేపాల్ చర్య సరైనది కాదు

ఇదిలా ఉంటే నేపాల్ భారత్ భూభాగాన్ని తమ భూభాగంలోకి కలిపివేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ గతనెలలో తెలిపారు. భారత భూభాగం ఏమిటో సరిహద్దులు ఏమిటో నేపాల్ ప్రభుత్వానికి తెలుసని అయినప్పటికీ ఈ చర్యకు పూనుకోవడం సరికాదని అన్నారు. ఈ వివాదంను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారని తాను విశ్వసిస్తున్నట్లు గతంలో శ్రీవాస్తవ చెప్పారు. ఇదిలా ఉండగానే ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎన్ నరవాణే నేపాల్‌తో భారత్‌కు మంచి సంబంధాలున్నాయని వ్యాఖ్యానించారు. భారత్ వాదన ఇలా ఉంటే నేపాల్ వాదన ఇందుకు భిన్నంగా ఉంది.

Recommended Video

India-Nepal : ఒక భారతీయుడిని కాల్చి చంపిన Nepal పై Army Chief కామెంట్లు Viral
ఆలయం నిర్మించి భారత్ తమదనే చెప్పుకుంటోంది

ఆలయం నిర్మించి భారత్ తమదనే చెప్పుకుంటోంది


భారత్ తమ భూభాగాన్ని ఆక్రమించుకుందంటూ నేపాల్ కొత్త వాదనకు తెరతీసింది. అంతేకాదు భారత జవాన్లను అక్కడ ఉంచి వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ అక్కడ కాళీ ఆలయం నిర్మించిందని అక్కడే ఒక కృత్రిమ నదిని నిర్మించి అక్కడ ఆర్మీ జవాన్లను ఉంచిందని దేశ ప్రధాని కేపీ ఓలీ ఆరోపణలు చేశారు. అందుకే అవి భారత్‌కు చెందుతాయనే భ్రమలో ఉన్నారని చెప్పారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నేపాల్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా తమదేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేపీ ఓలీ అన్నారు. అంతేకాదు కాలాపాని, లిపులేఖ్ మరియు లింపియధురా ప్రాంతాల చరిత్రను గమనించి భారత్ వెంటనే ఆ మూడు ప్రాంతాలను తిరిగి వెనక్కు ఇచ్చేయాలని నేపాల్ ప్రధాని డిమాండ్ చేశారు.

English summary
Nepal Parliament today gave a nod to the controversial new map.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X