వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ వల్లే నేపాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయ్: ప్రధాని కేపీ శర్మ అక్కసు

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి భారత్‌పై తన అక్కసును వెల్లగక్కారు. భారత్ వల్లే నేపాల్‌లో కరోనా కేసులు ఎక్కువగా మోదవుతున్నాయని ఆరోపించారు. సరిహద్దుల గుండా ఎలాంటి తనిఖీలు లేకుండా తమదేశంలోకి వస్తున్నారని అన్నారు.

 ఆకలి కేకలు: రైల్వే స్టేషన్లో ఆహార ప్యాకేట్లను ఎత్తుకెళ్లిన వలస కూలీలు(వీడియో) ఆకలి కేకలు: రైల్వే స్టేషన్లో ఆహార ప్యాకేట్లను ఎత్తుకెళ్లిన వలస కూలీలు(వీడియో)

సౌత్ ఆసియాలోనే నేపాల్ లో తక్కువ కరోనా కేసులు ఉన్నాయి. భారత్ నుంచి వస్తున్నవారి వల్లే దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని ఓలి ఆరోపించారు. సోమవారం 79 కొత్త కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 682కు చేరింది.

Nepal PM blames India for spread of coronavirus in the country

చైనా, ఇటలీల కంటే భారతదేశంలోని కరోనావైరస్ ఎంతో ప్రమాదకరమైనదని ఇంతకుముందు నేపాల్ ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి అక్రమంగా వస్తున్న వారి వల్లే నేపాల్ దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయని ఆరోపించారు. సరైన పత్రాలు లేకుండా భారత్ నుంచి వచ్చేవారిని రానీయొద్దంటూ అధికారులను ఆదేశించారు.

ఇండియాకు చెందిన లిపులేఖ్, కాలపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్ తన అధికారిక మ్యాప్ లో చూపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేపాల్ ప్రధాని ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. చైనా ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుందని తెలుస్తోంది. కాగా, భారత ప్రాంతాలను కలుపుకుని చూపడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటివి తాము సహించబోమని స్పష్టం చేసింది. చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచిదని తెలిపింది. భారత్ తమ సరిహద్దు భూభాగంలోనే రోడ్డు పనులు మొదలుపెట్టిన నేపథ్యంలో నేపాల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

English summary
Nepal’s Prime Minister KP Sharma Oli on Monday appeared to blame India for the rise in coronavirus cases, saying people were coming into the country from across the border without proper checks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X