వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టచ్ చేసింది: మోడీని ఆకాశానికెత్తిన మావో నేత ప్రచండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖాడ్మాండ్: ఇండియా క్రిటిక్, మావోయిస్టు నేత ప్రచండ భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మోడీతో ప్రచండ భేటీ అయ్యారు. మోడీతో భేటీ అనంతరం ప్రచండ ఆయన పైన ప్రశంసల వర్షం కురిపించారు.

భారత దేశానికి ప్రచండ గట్టి వ్యతిరేకి. అలాంటి ప్రచండ మోడీతో భేటీ పైన మాట్లాడుతూ.. మోడీ నేపాలీ ప్రజల ఫీలింగ్స్‌ను మాత్రమే టచ్ చేయలేదని, వారి హృదయాలను కూడా గెలుచుకున్నారని వ్యాఖ్యానించారు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మోవోయిస్టు చైర్మన్ ప్రచండ. ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష నేత. కొత్త రాజ్యాంగం రూపులో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. నేపాల్ రాజ్యాంగం, ఆర్థిక శ్రేయస్సు, రాజకీయ స్థిరత్వం పైన మోడీ వ్యాఖ్యలను ప్రచండ కొనియాడారు. పార్లమెంటులో మోడీ వ్యాఖ్యలు నేపాలీ ప్రజలను టచ్ చేశాయని, ఉత్సాహపరిచాయని అన్నారు.

మోడీతో భేటీ అనంతరం ప్రచండ మాట్లాడుతూ... భారత్-నేపాల్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలయిందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నేపాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రక్రియకు, దేశ ఆర్థిక పురోగతికి మద్దతిచ్చే విషయంలో మోదీ స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారని ప్రచండ అన్నారు. మోడీతో సమావేశం చాలా ఫలవంతమయిందని, భారత్-నేపాల్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలయిందని, ఇది నిజంగా చారిత్రాత్మకమన్నారు.

Nepal visit: India critic Prachanda praises PM Narendra Modi

రాజ్యాంగాన్ని త్వరగా రూపొందించుకోండి

మోడీ తన చారిత్రాత్మక నేపాల్ పర్యటనను సోమవారం ముగించుకుని భారత్‌కు తిరిగి వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే కృషిలో భాగంగా నేపాల్‌కు వివిధ రకాల సహాయాన్ని మోడీ ప్రకటించారు. గత 17 ఏళ్లలో నేపాల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీయే కావడం విశేషం. నేపాల్ వీలయినంత త్వరగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు రాంభరణ్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా సహా ఆ దేశ నాయకులకు మోడీ చెప్పారు.

‘మీరు పార్టీ గురించి కాదు దేశం గురించి ఆలోచించండి. నేపాల్‌కు వీలయినంత త్వరగా రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం ఉంది' అని మోైి వారికి చెప్పినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోబోదని మోైి తన పర్యటనలో నేపాల్‌కు హామీ ఇచ్చారు.

English summary
Former prime minister of Nepal and Maoist leader Pushpa Kamal Dahal aka Prachanda on Monday praised Indian Prime Minister Narendra Modi in lavish terms and described the bilateral trip as the beginning of a new chapter in the relation between the two neighbours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X