వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లొంగిపోలేదు, ఇండియాకెళ్తా: ఛోటా రాజన్

By Pratap
|
Google Oneindia TeluguNews

బాలి: తాను లొంగిపోలేదని, భారత్ వెళ్లాలని అనుకుంటున్నానని అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అన్నాడు. రెండు దశాబ్దాల పాటు పరారీలో ఉన్న అతను భారత్‌కు తిరిగి వెళ్తానని అంటున్నాడు. అతనిపై దాదాపు 75 కేసులు ఉన్నాయి. తాను జింబాబ్వే వెళ్లదలుచుకోలేదని అన్నాడు.

ఆదివారం నుంచి కస్టడీలో ఉన్న రాజన్‌ను భారత్ తీసుకుని వెళ్లడానికి భారత భద్రతా సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దావూడ్ ఇబ్రహీం ముఠా నుంచి ముప్పు పొంచి ఉండడంతో భారత్‌కు రాజన్‌ను ఎలా తీసుకుని వెళ్తారనే విషయంపై ఎవరూ నోరు విప్పడం లేదు.

‘Never surrendered, want to go back to India’, says Chhota Rajan

ఆస్ట్రేలియాలో ఉన్న ఛోటా రాజన్ తన ప్రాణాలకు దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ నుంచి ముప్పు ఉందని భావిస్తూ వచ్చాడు. బ్యాంకాక్‌లోని ఓ హోటల్లో ఛోటా రాజన్‌పై దావూద్ మనుషులు దాడి చేశారు. అయితే, ఛోటా రాజన్ తప్పించుకోగలిగాడు.

తనను జింబాబ్వే పంపించాలని పదేపదే తమను కోరాడని బాలి పోలీస్ కమిషనర్ రీయన్‌హార్డ్ నియాంగ్‌గోలన్ ఇంతకు తెలిపారు. పలు అరోగ్య సమస్యలతో రాజన్ ఉన్నాడన్న వార్తలను ఆయన ఖండించారు. రాజన్‌ను భారత్‌కు ఎప్పుడు అప్పగిస్తారన్న ప్రశ్నకు.. ముందు రాజన్‌ను ఇంటరాగేట్ చేసేందుకు భారత్‌నుంచి రావాల్సిన బృందంకోసం ఎదురు చూస్తున్నామని వియాంతో తెలిపారు. వారు వచ్చిన తర్వాత అప్పగింతపై చర్చిస్తామన్నారు.

English summary
Underworld don Chhota Rajan, who has been arrested after being on the run for over two decades, on Thursday claimed that he did not surrender and wants to return to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X