వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ కాలిడోనియాలో భారీ భూకంపం... సునామీ వచ్చే ప్రాంతాలివే..!

|
Google Oneindia TeluguNews

పసఫిక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. ప్రజలు అప్రమత్తతో ఉండాలని సునామీ వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఫ్రాన్స్ ప్రభుత్వం సూచించింది. భూకంపం కేంద్రీకృత చోట నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు పసఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. వానువాటూ ,న్యూ కలెడోనియా తీరంలో ఈ సునామీ కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. సముద్ర గర్భంలో భూమి కంపించడంతో ఆ ప్రభావం ఆస్ట్రేలియా తూర్పు తీరంలో కూడా కనిపించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ భూకంపం న్యూ కాలెడోనియాలోని లాయల్టీ దీవులకు సుమారు 155 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. ఈ దీవిలో చివరిగా ఆగష్టులో భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7గా నమోదైంది. ఒకే వారంలో 214 భారీ భూకంపాలు సంభవించిన తర్వాత చివరిగా ఓ అతిపెద్ద భారీ భూకంపం అంటే మెగాభూకంపం వచ్చి సర్వం తుడుచుకుపెట్టుకుపోతుందన్న వార్త దావనంలా పాకడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

New Caledonia earthquake:Tsunami warning as strong 7.6 quake strikes off French territory

ఇదిలా ఉంటే న్యూకాలిడోనియాలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో 70కి పైగా భూకంపాలు సంభవించి ఉంటాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతం దక్షిణ అమెరికా నుంచి పాశ్చాత్య అమెరికా, తూర్పాసియా మీదుగా ఆస్ట్రేలియా వరకు ఉంటుంది. అందుకే న్యూ కాలెడోనియాలో భూకంపం వస్తే ఆ ప్రబావం మిగతా దేశాలపై కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే దక్షిణ పసఫిస్ సముద్రంలో సంభవించిన భూకంపంతో హవాయికి ఎలాంటి సునామీ ప్రమాదం లేదని పసఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

English summary
Residents on the Pacific island, which is governed by France, have been warned to "seek safety" with giant waves expected from underwater aftershocks.In a statement, Pacific Tsunami Warning Centre said: "Hazardous tsunami waves from this earthquake are possible within 1,000km (600 miles) of the epicentre along the coasts of Vanuatu and New Caledonia."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X