వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

56 శాతం వేగంగా వ్యాపిస్తోంది.. కొత్త రకం వైరస్‌పై శాస్త్రవేత్తలు..

|
Google Oneindia TeluguNews

కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. దీని ఆనవాళ్లు బ్రిటన్‌లో బహిర్గతమైన సంగతి తెలిసిందే. అయితే ఇదీ కరోనా వైరస్ కంటే 56 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదీ తమ అధ్యయనంలో తేలిందని వివరించారు.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

కొత్త కరోనా వైరస్ నవంబర్‌లో ఆగ్నేయ ఇంగ్లండ్‌లో వేగంగా విస్తరించింది. దీంతో చాలా మంది ఆస్పత్రిలో చేరతారని.. మరణాలు కూడా సంభవిస్తాయని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ సెంటర్ ఫర్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ తెలిపింది. కొత్త వైరస్ అధికంగా ప్రభావం చూపుతుందా అనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. ఆగ్నేయ ఇంగ్లిష్, ఈశాన్య లండన్, తూర్పు లండన్‌లో కొత్త రకం వైరస్ గురించి పరిశోధనలు చేస్తున్నారు.

New Coronavirus Strain 56 Per cent More Contagious, to Cause More Deaths in Britain

కొత్త రకం వైరస్ వేగంగా పెరిగే అవకాశం ఉంది అని.. 2020లో సంభవించిన మరణాల కంటే ఎక్కువ జరిగే అవకాశం ఉంది అని నిపుణులు తెలిపారు. వైరస్ ప్రభావం నేపథ్యంలో నవంబర్‌లో స్కూల్, వర్సిటీలు క్లోజ్ చేశారని.. లేదంటే మరింత వేగంగా వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్నారు.

క్రిస్మస్ సందర్భంగా కొత్త రకం వైరస్ 70 శాతం ఎక్కువ వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం చైనాలో ఆవిర్భవించిన కరోనా వైరస్ వల్ల 1.7 మిలియన్ల మంది ఇప్పటికే చనిపోయారు. వైరస్ కోసం వ్యాక్సిన్ ప్రయత్నాలు కొలిక్కి వస్తుండగా.. కొత్త రకం వైరస్ జాడ తెలిసింది. వైరస్ వెలుగుచూసిన బ్రిటన్ నుంచి ప్రయాణంపై ఇతర దేశాలు ఆంక్షలు విధించాయి.

English summary
coronavirus strain spreading in Britain is on average 56 percent more contagious than the original version, scientists have warned in a study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X