వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్లకు గ్రీన్ కార్డు గగనమే.. : హెచ్1 బీపై ఆదేశాలిస్తే కష్టమేనన్న స్టార్టప్‌లు

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనే భారతీయులకు గడ్డుకాలం ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనే భారతీయులకు గడ్డుకాలం ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా శాశ్వత నివాసానికి దోహద పడే గ్రీన్‌కార్డుల జారీలో కోత విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే జరిగితే గ్రీన్ కార్డుల జారీ సగానికి పడిపోతుంది.

తద్వారా చట్టబద్ధ వలసదారుల సంఖ్య సగానికి తగ్గించేందుకు ఇమిగ్రేషన్ చట్ట సవరణకు ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టింది. సీనియర్ సభ్యులు టామ్ కాటన్ (రిపబ్లికన్), డేవిడ్ పెర్డూ (డెమొక్రటిక్)లు సెనెట్‌కు అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్‌మెంట్ (రైజ్) యాక్ట్‌కు సవరణలు ప్రతిపాదించారు. నైపుణ్యం ఆధారంగా ఇచ్చే వీసాల్లో సగానికి కోత విధించాలన్న ప్రధాన ఎజెండాతో ఇమిగ్రేషన్ చట్టం సవరించాలని సెనెట్‌ను కోరారు.

ఇప్పటివరకు గ్రీన్‌కార్డు, శాశ్వత నివాసానికి ఏటా 10 లక్షలమందికి అనుమతి లభించేది. బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపితే ఇక ఏటా ఐదు లక్షలమందికే అనుమతి లభిస్తుంది. సాధారణంగా ఓ ఇండియన్‌కు పదేళ్లలో రావాల్సిన గ్రీన్‌కార్డు 35 ఏళ్ల వరకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాగా, గ్రీన్‌కార్డు ఎంపికకు అమలుచేస్తున్న బహుముఖ వీసా లాటరీ విధానం కూడా రద్దు చేయాలని సెనెటర్లు ప్రతిపాదించారు. ఇందులో మోసాలు జరుగుతున్నాయని, మానవత్వ దృక్పథానికి అవకా శం లేకుండాపోయిందని, పేరుకే తప్ప బహుముఖ ఉపయోగం ఎంతమాత్రం లేదని విమర్శించారు.

ట్రంప్ ఆదేశాలే పాటించాలా?

ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏడు దేశాల ప్రజలను అమెరికాలోకి అడుగుపెట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. మొత్తం ముస్లింలపై విధించిన నిషేధం కాదా..? అని శాన్ ఫ్రాన్సిస్కో న్యాయస్థానం ప్రశ్నించింది. ఏడు దేశాల ప్రజల రాకపై ట్రంప్ ప్రభుత్వ నిషేధాజ్నలపై సియాటెల్ కోర్టు స్టే ఆదేశాలపై విచారణ చేపట్టిన శాన్ ఫ్రాన్సిస్కో న్యాయస్థానం.. ట్రంప్ తరఫు న్యాయవాదిని వివరణ కోరింది. గంటపాటు సాగిన విచారణలో న్యాయమూర్తులు పలు విషయాలపై ప్రభుత్వ తరఫు న్యాయవాది మైఖెల్ ఫ్లెట్జ్‌ను ప్రశ్నించారు.

New Donald Trump shocker for Indians: Law introduced to cut legal immigrants to US by half

నిర్దేశిత దేశాలనుంచి అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతున్నట్లు ప్రభుత్వం వద్ద నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయా?, అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్నిన్యాయస్థానాలు సమీక్షించకూడదా?, ముస్లింలను దేశంలోకి అడుగుపెట్టనివ్వబోమని అధ్యక్షుడు చెప్పదలుచుకున్నారా? దాన్ని ఎవరూ ప్రశ్నించవద్దా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఫ్లెట్జ్‌పై త్రిసభ్య న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేయడంతో ట్రంప్ ఆదేశాలపై సియాటెల్ కోర్టు స్టే ఉత్తర్వులు అమలు కానున్నాయి. గమ్మత్తేమిటంటే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ సొలిసిటర్ జనరల్ నోవాహ్ పుర్సెల్ న్యాయస్థానంలో వ్యతిరేకించారు.

'హెచ్‌-1బీ'పై ఆదేశాలొద్దు: ట్రంప్‌కు స్టార్టప్ సంస్థల లేఖ

హెచ్‌-1బీ వీసాలపై ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇవ్వవద్దంటూ 100కు పైగా స్టార్టప్స్‌ కంపెనీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభ్యర్థించాయి. ఇటువంటి చర్య వల్ల స్టార్టప్స్‌తోపాటు ప్రపంచ దేశాలతో పోటీపడే అమెరికా సామర్ధ్యంపైనా కోలుకోలేని దెబ్బ పడుతుందని పేర్కొంటూ సదరు స్టార్టప్స్ యాజమాన్యాలు ట్రంప్‌కు బహిరంగ లేఖ రాశాయి.

స్వదేశీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ, జాతీయ భద్రత పెంపుదలకు ప్రస్తుత, ప్రతిపాదిత ఆదేశాలు లక్ష్యాలను నెరవేర్చలేవని తాము నమ్ముతున్నామని ఆయా స్టార్టప్ సంస్థలు స్పష్టం చేశాయి. అమెరికాలో ఉద్యోగాలను కల్పించే కొత్త సంస్థల ఎదుగుదల సామర్ధ్యం క్షీణించే అవకాశం ఉందని తెలిపాయి.

అమెరికా ఆర్థిక భవితవ్యంపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరాయి. ముస్లిందేశాల పౌరుల నిషేధ ఉత్తర్వులు.. ఉద్యోగ వీసా తదితర అంశాలపై ఇటీవల బయటపడిన ప్రతిపాదిత ప్రణాళికలపై ఆయాసంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. హెచ్‌1-బీ ఉద్యోగులకు సంబంధించి.. నైపుణ్యాలున్న ప్రతి 100మంది వలస ఉద్యోగులవల్ల 86మంది అమెరికన్లకు ఉద్యోగాలు దొరుకుతున్నట్లు ఒక విశ్లేషణను లేఖలో గుర్తుచేశాయి.

English summary
Two top US senators have proposed a legislation to cut the number of legal immigrants to the US by half within a decade, a move that could adversely hit those aspiring to get a green card or permanent residency in the US including a large number of Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X