వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌరవ్యవస్థలో కొత్త మరుగుజ్జు గ్రహం పేరేంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

సౌరమండలంలో మరో గ్రహాన్ని కనుగొన్నారు నాసా శాస్త్రవేత్తలు. ఇది కూడా మరుగుజ్జు గ్రహమేనని వారు పేర్కొన్నారు. ఇది ప్లూటో గ్రహానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పిన శాస్త్రవేత్తలు దీనిపేరు గోబ్లిన్ అని తెలిపారు. ఇది 2015లో అంతరిక్షయానం చేసిన వ్యోమగాములు కనుగొన్నారు. అయితే పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసిన తర్వాతే అక్టోబర్ 2న నిర్ధారించారు. భూమిపై నుంచి టెలిస్కోప్ ద్వారా పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు అధికారికంగా సౌరమండలంలో గోబ్లిన్ అనే గ్రహం ఉందని ప్రకటించారు.

కార్నేజీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పనిచేస్తున్న వ్యోమగామి స్కాట్ షెపర్డ్ ... గోబ్లిన్ అనే కొత్త గ్రహం ప్లూటో గ్రహం తర్వాత ఉందని చెప్పారు. ఈ గ్రహానికి ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ యూనియన్ మైనర్ ప్లానెట్ సెంటర్ అధికార పేరు 2015 TG387ను ఇచ్చింది.ఇది సౌర మండలంలో కనుగొన్న మూడో మరుగుజ్జు గ్రహం అని వెల్లడించారు.

గాబ్లిన్ గ్రహం విశేషాలు

గాబ్లిన్ గ్రహం విశేషాలు

గాబ్లిన్ యొక్క కక్ష్య చాలా పొడవుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడి చుట్టూ తిరిగేందుకు ఇది 40వేల సంవత్సరాల సమయం తీసుకుంటుందని చెప్పారు. సూర్యుడి నుంచి భూమికంటే 2,300 రెట్లు దూరంలో గాబ్లిన్ గ్రహం ఉందని వివరించారు. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని అస్ట్రానామికల్ యూనిట్స్‌తో కొలుస్తాము. ఒక అస్ట్రానామికల్ యూనిట్ 93 మిలియన్ మైళ్లు. అంటే సుమారుగా 150 మిలియన్ కిలోమీటర్లు. అంటే గాబ్లిన్ గ్రహం నుంచి సూర్యుడు 65 అస్ట్రానామికల్ యూనిట్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారు. అదే ప్లూటో అయితే సుమారు 30 ఏయూ నుంచి 50 ఏయూల మధ్య ఉంటుంది.

ఉక్కు గ్రహం! కొత్తగా కనుగొన్న శాస్త్రవేత్తలు, భూమికంటే పెద్దది, బరువు కూడా!ఉక్కు గ్రహం! కొత్తగా కనుగొన్న శాస్త్రవేత్తలు, భూమికంటే పెద్దది, బరువు కూడా!

 ప్లూటోకు వెనకాల ఉన్న గాబ్లిన్ గ్రహం

ప్లూటోకు వెనకాల ఉన్న గాబ్లిన్ గ్రహం

2015లో అంతరిక్షయానంకు వెళ్లిన సమయంలో షెపర్డ్ ఇతర వ్యోమగాములతో కలిసి గాబ్లిన్ గ్రహాన్ని కనుగొన్నారు. ఆ సమయంలో ఇది సూర్యుడికి కాస్త దగ్గరగానే అంటే 80 అస్ట్రానామికల్ యూనిట్ల దూరంలో ఉందని తెలిపారు. మిగత రెండు మరుగుజ్జు గ్రహాలు 2003లో కనుగొన్న సెడ్నా సూర్యునికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండగా... 2012లో కనుగొన్న VP113 గ్రహం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు సౌరమండలంలో ఇలాంటి మరుగుజ్జు గ్రహాలు చాలానే ఉన్నట్లు వ్యోమగాములు వివరించారు. కొన్ని పెద్దవిగా కూడా ఉన్నాయని చెప్పిన వీరు.... భూమి కంటే పెద్దవిగా ఉన్నాయని ప్లానెట్9 లేదా ప్లానెట్ ఎక్స్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఇవి సూర్యునికి కొన్నివందల అస్ట్రానామికల్ యూనిట్ల దూరంలో ఉన్నాయని చెప్పారు.

 సౌర వ్యవస్థలో బ్రెడ్ ముక్కల్లా కనిపిస్తున్న చాలా గ్రహాలు

సౌర వ్యవస్థలో బ్రెడ్ ముక్కల్లా కనిపిస్తున్న చాలా గ్రహాలు

సౌరమండలంలో ఉండే ఈ గ్రహాల కక్ష్యలు చాలా పొడవుగా ఉండటంతో వాటిని గుర్తించలేక ఉన్నామని ఎప్పుడైతే అవి సూర్యుడికి దగ్గరగా వస్తాయో అప్పుడు ఆ గ్రహాల గురించి పరిశోధనలు చేసే అవకాశముందన్నారు షెపర్డ్. దూరంగా ఉన్న గ్రహాలు బ్రెడ్ ముక్కల్లా చిన్నగా కపబడుతున్నాయని చెప్పారు. ఇలాంటివి ఎంత ఎక్కువగా కనిపిస్తే అంత బాగా బాహ్యసౌరమండలం పై పరిశోధనలు చేయొచ్చన్నారు. ఈ క్రమంలోనే ఏదైతే గ్రహాలు చుట్టూ తిరుగుతున్నాయో వాటిని కూడా స్టడీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇలా పరిశోధనలు చేయడం ద్వారా మన సౌరమండలం ఆవిర్భావం నుంచి ఎన్నో విషయాలను కనుగొనే అవకాశం ఉందని షెపర్డ్ వివరించారు.

English summary
A scrawny dwarf planet nicknamed the Goblin has been discovered well beyond Pluto. A round frozen world just 186 miles (300 kilometres) across, the Goblin was spotted by astronomers in 2015 around Halloween, thus its spooky name. But it wasn’t publicly unveiled until on October 2 following further observations with ground telescopes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X