వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మనిషిలా నడుస్తున్న ఎలుగుబంటి!(వీడియో)
న్యూజెర్సీ : అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రంలో ఓ ఎలుగుబంటి అచ్చం మనిషిలా నడుస్తోంది. కేవలం వెనుక కాళ్ల మీదే ఇలా నడుస్తోంది. ఏదైనా అత్యవసరమైతే తప్ప ముందుకు వంగడం లేదు. ఓక్రిడ్జ్ నగరంలో ఇది సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఆ తర్వాత దాని ముందు కాళ్లకు దెబ్బ తగలడంతోనే అది ఆ కాళ్లను సరిగా వాడటం లేదని గుర్తించారు. కాగా, 'పెడల్స్' అని దీనికి ముద్దు పేరు ఉంది. ఎలుగుబంటి నడుస్తున్న వీడియో ఇప్పుడు ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది.
తొలుత దీన్ని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించాలని డిమాండ్లు వచ్చాయి. కానీ, న్యూ జెర్సీ అధికారులు మాత్రం పెడల్స్‌ను అడవిలోనే వదిలేశారు.