వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: తల్లీ కొడుకు ప్రాణం తీసిన కార్బన్‌ మోనాక్సైడ్‌

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూజెర్సీ: గత వారంలో అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్ అక్కడ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆమెరికాలోని పలు రాష్ట్రాల్లో కురిసిన మంచు తుఫాన్ ఇళ్లతో పాటు, వీధుల్లోని కార్లను కూడా కప్పేసింది. అలా ఓ కారుపై పడిన దట్టమైన మంచును తొలగించే ప్రయత్నంలో ఓ తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే.... న్యూజెర్సీకి చెందిన ఫెలిక్స్‌ బొనిల్లా కారు మంచు తుఫాన్‌లో కూరుకుపోయింది. దీంతో తన భార్య రోసా(23)తో పాటు, ఏడాది వయసున్న కొడుకు మెస్సయ్య, మూడేళ్ళ కూతురును కారులో కూర్చోబెట్టి ఇంజన్‌ స్టార్ట్‌ చేసిన బొనిల్లా, కారు ఇంజన్‌ వేడెక్కేలా యాక్సిలేటర్‌‌ను రైజ్‌ చేయమని చెప్పాడు.

New Jersey woman Sashalynn Rosa and her son die of carbon monoxide poisoning

ఈ క్రమంలో తాను బయట ఉండి కారుపై పడిన మంచును తొలగించే పనిలో ఉన్నాడు. కారు సైలెన్సర్‌ను మంచు మూసేయడంతో, యాక్సిలేటర్‌ రైజ్‌ చేయడంతో ఆ పొగ తిరిగి కారులోనే నిండిపోయింది. దీంతో కార్బన్‌ మోనాక్టైడ్‌ వ్యాపించి ఊపిరాడక తల్లితో పాటు, ఏడాది వయసున్న కొడుకు కారులోనే చనిపోయారు.

వెంటనే దీనిని గమనించిన ఫెలిక్స్‌ బొనిల్లా తన భార్య పిల్లలిద్దరినీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన తన కూతురుని సమీప ఆసుపత్రిలో చేర్పించాడు. ప్రస్తుతం ఆ బాలిక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఇటీవల అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్‌ ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా అమెరికా రాజధాని వాషింగ్టన్, న్యూయార్క్‌లతో పాటు తూర్పు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మంచు తుఫాన్‌కు 25 మందికి పైగా చనిపోయారు.

English summary
A 23-year-old mother and her one-year-old son have died of carbon monoxide poisoning after snow blocked the tailpipe of their car as they searched for a parking place. The mom was identified on Sunday as Sashalynn Rosa and her son was named Messiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X