వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ వీసా ఇక వారిష్టం! ఇండియన్ ఐటీ సంస్థలు, టెక్కీలపై ప్రభావం

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హెచ్1బీ వీసాదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. అమెరికా పౌర, వలస సేవల విభాగం (ఊఎస్ఐఎస్) ఇటీవల నిబంధనల్ని కఠినం చేసింది. హెచ్1బీ వీసా దరఖాస్తులను ఆమోదించేందుకు కఠిన వైఖరి అవలంభిస్తోంది. హెచ్1బీ దరఖాస్తుదారులు ఎక్కువగా ఉంటుండటంతో... దరఖాస్తుల్లో తప్పులు లేదా లోపాలు ఉంటే ఎలాంటి సమాచారం లేకుండా తిరస్కరించే అధికారం ఉంది.

దరఖాస్తు బాగుందని యూఎస్ఐఎస్‌కు అనిపిస్తే ఆమోదం లభిస్తుంది. దరఖాస్తు తిరస్కరణకు కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కొత్త పాలసీ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అమలులోకి రానుంది. తమ దరఖాస్తు తిరస్కరణకు గురైతే వారు దేశం విడిచి వెళ్లవలసి ఉంటుంది. లోపాలు లేకున్నా తిరస్కరణకు గురైనట్లు భావిస్తే న్యాయస్థానానికి వెళ్లవచ్చు.

 New rule makes it easier for US officials to deny H1B visas

హెచ్1బీ తిరస్కరణకు గురైతే దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేస్తారు. దేశం విడిచి వెళ్లకుంటే ఎన్టీఏ జారీ చేస్తారు. అప్పటికి వెళ్లకుంటే పదేళ్లపాటు అమెరికా రాకుండా చేస్తారు. ఈ నిర్ణయం ఇండియన్ సాఫ్టువేర్ ఉద్యోగులు, ఐటీ కంపెనీలపై బాగా ప్రభావంపడనుంది.

దరఖాస్తుదారు న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నంత మాత్రాన గతంలో మాదిరిగి ఉద్యోగం చేయడానికి అర్హత ఉండదు. అప్పీల్ పరిష్కారమయ్యే వరకు గరిష్టంగా 240 రోజులు అమెరికాలో ఉండవచ్చు.

English summary
The Donald Trump administration has given its immigration officials more power to reject H-1B visa applications outright.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X