వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా : బయోలజీ ప్రొఫెసర్ సంచలన అధ్యయనం.. వీధి కుక్కల ద్వారా వైరస్ వ్యాప్తి..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మూలాలు,దాని విరుగుడుకు కావాల్సిన వ్యాక్సిన్ తయారీపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి కొలిక్కి రావడానికి ఎంతలేదన్నా ఒక ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అధ్యయనాలు,పరిశోధనల్లో వెల్లడవుతున్న కొన్ని విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వైరస్ మూలాలను శోధించే అధ్యయనంలో భాగంగా తాజాగా ఓ చైనీస్ సైంటిస్ట్ ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు. నిన్న మొన్నటిదాకా గబ్బిలాలు లేదా అలుగుల ద్వారా మనుషులకు వైరస్ సోకి ఉండవచ్చునన్న ఊహాగానాలు ప్రచారంలో ఉండగా.. తాజా అధ్యయనంలో వీధి కుక్కల ద్వారా వైరస్ వ్యాప్తి జరగవచ్చునన్న వాదన తెర పైకి వచ్చింది.

ఎవరా సైంటిస్ట్.. ఏం కనిపెట్టారు..

ఎవరా సైంటిస్ట్.. ఏం కనిపెట్టారు..

యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావాలో బయోలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జుహువా జియా వీధి కుక్కల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని కనిపెట్టారు. గతంలో బయోఇన్ఫర్మెటిక్స్,పరమాణు పరిణామ క్రమం అనే రెండు పుస్తకాలను ఆయన ప్రచురించారు. తన అధ్యయనంలో వివిధ జీవజాలాలతో పాటు వీధి కుక్కుల జీర్ణాశయంలోని ప్రేగుల్లో SARS-CoV-2 వైరస్ మూలాలను కనిపెట్టారు. ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ మాలిక్యులర్ బయోలాజీ&ఎవల్యూషన్ జర్నల్‌ తాజా ఎడిషన్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.

కెనిడ్స్‌ జీర్ణాశయ ప్రేగుల్లో కరోనా వైరస్

కెనిడ్స్‌ జీర్ణాశయ ప్రేగుల్లో కరోనా వైరస్


జియా అనేక జీవ జాలాల్లోని వైరస్‌ల పరమాణు పరిణామ క్రమాలపై సుదీర్ఘకాలంగా అధ్యయనం చేస్తున్నారు. పాములు,అలుగులు వంటి జంతువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందిందన్న వాదనకు భిన్నమైన విషయాలు ఆయన అధ్యయనంలో వెల్లడయ్యాయి. ఈ జంతువుల నుంచి వేరు చేసిన వైరస్ నమూనాలు SARS-CoV-2కి భిన్నంగా ఉన్నాయని ఆయన కనిపెట్టారు. అంతేకాదు, SARS-CoV-2 వ్యాప్తికి సమీప కారకాలుగా ఉన్న గబ్బిలాల ద్వారా కెనిడ్స్(ఒకరకమైన శునక జాతి) పేగులకు ఇది సోకిందని,వాటిల్లో అది వేగంగా పరిణామం చెంది మనుషులకు వ్యాప్తి చెందిందని కనిపెట్టారు.

అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

తన అధ్యయనం కోసం జుహువా జియా ఇప్పటివరకు 1252 పూర్తి బీటా కరోనా వైరస్ జన్యువులను జెన్‌బ్యాంక్‌లో భద్రపరిచారు. SARS-CoV-2 మరియు దానికి దగ్గరి సంబంధం ఉన్న గబ్బిలాలు(BatCoV RaTG13) తక్కువ స్థాయిలో సీపీజీని కలిగివున్నట్టు గుర్తించారు. తక్కువ CpG కలిగి వైరల్ జన్యువులకు సానుకూలంగా ఉండే ఏదో ఒక జంతువు నుంచి ఈ వైరస్ తీవ్ర స్థాయిలో ఉద్భవించిందని కనిపెట్టారు. ఇదే క్రమంలో కుక్కలపై పరిశోధన జరపగా SARS-CoV-2, BatCoV RaTG13 మాదిరి వాటిల్లోనూ ఒకే రకమైన సీపీజీ జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. కుక్కల జీర్ణాశ్రయంలోని ప్రేగుల్లో కరోనావైరస్ జన్యువులను గుర్తించారు.అంతేకాదు,ఒంటెల్లోనూ ఈ తరహా వైరస్‌లను గుర్తించారు.

Recommended Video

Lockdown 2.0 : New Coronavirus Lockdown Guidelines Released
వీధి కుక్కలే కారకాలైతే..

వీధి కుక్కలే కారకాలైతే..


శునకాలు,ఒంటెల శ్వాసకోశ వ్యవస్థపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందని కనిపెట్టారు. శునకాలు లైంగికపరమైన చర్యలతో పాటు సాధారణ సమయాల్లోనూ తమ జననాంగాలను నాకుతుంటాయని.. తద్వారా వైరస్‌లు వాటి ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశం ఉందని గుర్తించారు. జుహువా జియా చేసిన ఈ పరిశోధన ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ఒకవేళ ఆయన చెప్పినట్టు కెనిడ్స్ లాంటి శునక జాతి వల్లనే వైరస్ వ్యాప్తి జరిగినట్టయితే.. ప్రపంచవ్యాప్తంగా దాని తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. జుహువా,అధ్యయనం,పరిశోధనలపై ఇతర శాస్త్రవేత్తలు కూడా స్పందించాల్సి ఉంది.

English summary
As scientists across the world scramble to identify the source of the novel coronavirus, a new study points to stray dogs as possible intermediary hosts of Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X