వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్ ఫస్ట్: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్‌కమ్..

ఆక్లాండ్‌లోని సిటీ సెంటర్ లో ఉన్న స్కై టవర్స్ లో బాణసంచా పేల్చుతూ అక్కడి ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

|
Google Oneindia TeluguNews

ఆక్లాండ్: ప్రపంచమంతా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి ఇండియాకు మరికొన్ని గంటల సమయం ఉండగా.. ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందు న్యూజిలాండ్ లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఆక్లాండ్‌లోని సిటీ సెంటర్ లో ఉన్న స్కై టవర్స్ లో బాణసంచా పేల్చుతూ అక్కడి ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. స్కై టవర్స్ దాదాపు 1080 అడుగులు ఎత్తులో ఉండటం గమనార్హం. దీంతో నగరమంతా మిరుమిట్లు గొలిపే వెలుగుతో.. ఆక్లాండ్ లో కొత్త సంవత్సర శోభ అప్పుడే మొదలైపోయింది.

New Year celebrations: NZ's Auckland first world city to welcome in 2017

కాగా,ఈమధ్యే బెర్లిన్ లో జరిగిన దురాగతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా దేశాలు భద్రతను అలర్ట్ చేశాయి. క్రిస్ మస్ వేడుకల్లో భాగంగా సంబరాల్లో మునిగి తేలుతున్న జనాల మీదకు ట్రక్కుతో దూసుకొచ్చిన దుండగుడు 12మంది పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.

పారిస్, మాడ్రిడ్ మరియు న్యూయార్క్ దేశాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ సామాగ్రితో వెళ్లే వాహనాలను జనం రద్దీగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

English summary
Auckland in New Zealand has become the first major world city to welcome 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X