వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16సార్లు న్యూఇయర్ వేడుకలు: గిన్నిస్ రికార్డు తిరగరాసిన బుర్జ్ ఖలీఫా

|
Google Oneindia TeluguNews

దుబాయ్: నూతన సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం దుబాయిలోని బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డును తిరగరాసింది. భవనం చుట్టూ అమర్చిన 70 వేల ఎల్‌ఈడీ బల్బులు ఈ రికార్డుకు కారణమయ్యాయి.

కనీవినీ ఎరుగని రీతిలో ఇంత భారీస్థాయిలో అమర్చిన ఎల్‌ఈడీ లైట్లతో 829.8 మీటర్ల ఎత్తున్న బుర్జ్ ఖలీఫా ఓ వెలుగు వెలిగింది. దీనికితోడు 4.7 టన్నుల పటాకులు, లేజర్ షో వెలుగుజిలుగులతో ప్రపంచంలోని కొత్త సంవత్సర శోభ మొత్తం దుబాయ్‌లోనే కనిపించినట్లయింది.

వేల మంది స్థానికులు, పర్యాటకులు ప్రత్యక్షంగా.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది టీవీల్లో ఈ అద్భుతాన్ని చూసి ముగ్ధులైపోయారు. ఈ వేడుకలను నిర్వహించడానికి ప్రపంచంలోని 200 మంది నిపుణులు సుమారు లక్షా 92 వేల గంటల పాటు శ్రమించారట.

New Year eve gala around Burj Khalifa breaks Guinness Record

అంతరిక్ష కేంద్రంలో 16సార్లు కొత్త సంవత్సర వేడుకలు

వాషింగ్టన్: నూతన సంవత్సర వేడుకలు ప్రపంచంలో ఎవరికైనా ఒకేసారి వస్తాయి. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోని వ్యోమగాములు మాత్రం ఏకంగా 16సార్లు వేడుకలు జరుపుకొన్నారు. భూమి చుట్టూ గంటకు 28163 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఐఎస్‌ఎస్.. 16 సందర్భాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయాన్ని చవిచూసిందని నాసా ప్రకటించింది.

ఐఎస్‌ఎస్‌లో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ద ఎక్స్‌పెడిషన్ 42లోని ఐదుగురు వ్యోమగాములు.. తమ రోజువారీ పరిశోధనల్లో నిమగ్నమవుతూనే 16సార్లు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు.

English summary
A dazzling show of New Year’s Eve gala using 70,000 LED bulbs around the world’s tallest building Burj Khalifa here has broken the Guinness World Record of the ‘Largest LED-Illuminated Facade’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X