వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్ దాడి: ఏడాది ప్లాన్, అతనికి ఉరిశిక్ష అన్న ట్రంప్, ఆ అధికారిపై ప్రశంసలు

న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది సామాన్యులు మృతి చెందారు. ఈ దాడికి ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది సైఫుల్లో హబీబుల్లావిక్ సైపోవ్ పాల్పడ్డాడు. అతడు ఉజెకిస్తాన్ ద

|
Google Oneindia TeluguNews

Recommended Video

New York Truck Incident : న్యూయార్క్ ట్రక్కు బీభత్సం: ఏడాది ప్లాన్

న్యూయార్క్: న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది సామాన్యులు మృతి చెందారు. ఈ దాడికి ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది సైఫుల్లో హబీబుల్లావిక్ సైపోవ్ పాల్పడ్డాడు. అతడు ఉజెకిస్తాన్ దేశస్తుడు.

ఉబెర్ డ్రైవర్ నుంచి ఉగ్రవాదిగా.. 8మంది ప్రాణాలు తీసిన సైపుల్లా, అంతకుముందు ఇలా..ఉబెర్ డ్రైవర్ నుంచి ఉగ్రవాదిగా.. 8మంది ప్రాణాలు తీసిన సైపుల్లా, అంతకుముందు ఇలా..

 ఏడాదిగా ప్లాన్

ఏడాదిగా ప్లాన్

ఈ దాడి కోసం దుండగుడు ఏడాది నుంచి ప్లాన్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇస్లామిక్ స్టేట్ (ఐసి) వీడియోలను చూసి తాను ప్రేరణ పొందినట్లు అతను వెల్లడించాడని తెలుస్తోంది.

దాడి చేసినందుకు బాధ లేదు

దాడి చేసినందుకు బాధ లేదు

ప్లాన్‌ను అమలు చేసేముందు అక్టోబర్ 22వ తేదీన ఓసారి ట్రయల్ వేసుకొని చూశానని, ఈ దాడి చేసినందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని, చాలా సంతోషంగా ఉందని విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ ఎక్కువ మంది ఉంటారని తెలిసి దాడి చేసినట్లు చెప్పాడు.

 తొలుత అక్కడ అనుకున్నాడు కానీ

తొలుత అక్కడ అనుకున్నాడు కానీ

తొలుత బ్రూక్లీన్ బ్రిడ్జి పైన దాడి చేద్దామనుకున్నానని, కానీ చివరి నిమిషంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపాన్ని ఎంచుకున్నట్లు ఆ నిందితుడు చెప్పాడు. కాగా, అతనిని కోర్టులో హాజరుపరిచారు. అతనికి మరణ శిక్ష విధించే అవకాశముందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అటార్నీ జాన్ కిమ్ అన్నారు.

 ఆ అధికారే స్పందించకుంటే

ఆ అధికారే స్పందించకుంటే

ఇదిలా ఉండగా, ఈ ట్రక్కు బీభత్సం ఘటనలో రేయాన్ నాష్ అనే 28 ఏళ్ల పోలీసు అధికారి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాది సైఫుల్లో తన వద్ద ఉన్న బొమ్మ తుపాకినీ నిజమైన తుపాకీగా చూపించి, బెదిరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీస్ అధికారి రేయాన్ నాష్ బెదరలేదు. ఉగ్రవాదిపై కాల్పులు జరిపాడు.

English summary
The suspect in New York's deadliest terror attack since 9/11 has been charged with federal terrorism offenses in Tuesday's attack that left eight people dead, authorities said. Sayfullo Habibullaevic Saipov, a 29-year-old Uzbekistan native who was living in New Jersey, is charged with providing material support to ISIS, dviolence and destruction of motor vehicles, said Joon H. Kim, the acting US Attorney for the Southern District of New York.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X