వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో బాంబు పేలుడు: బంగ్లాదేశీయుడి అరెస్ట్, అదే జరిగితే భారీ ప్రాణ నష్టం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్ స్వ్కేర్ వద్ద బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

అమెరికా కాలమానం ప్రకారం ఉదయం ఏడున్నర గంటలకు సమయంలో ఈ బాంబు దాడి జరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో న్యూయార్క్‌లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు.

న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ వద్ద బాంబు పేలుడు చోటు చేసుకొంది. పేలుడు సమయంలో తొక్కిసలాట చోటు చేసుకొంది. దీంతో 42 అవెన్యూ వద్ద ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు.

న్యూయార్క్ పేలుడుకు బంగ్లావాసే కారణమా

న్యూయార్క్ పేలుడుకు బంగ్లావాసే కారణమా

న్యూయార్క్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన వ్యక్తిని బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్‌ ఉల్లాగా పోలీసులు గుర్తించారు.మాన్‌హట్టన్‌ 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ బస్‌ టెర్మినల్‌ వద్ద పేలుడు అనంతరం ఒక వ్యక్తి గాయాలతో పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు.అతని పొట్ట భాగంలో, వేసుకున్న జాకెట్‌లో వైర్లు ఉండటాన్ని గమనించారు.

ఎలక్ట్రిక్ కంపెనీలో బాంబు తయారీ

ఎలక్ట్రిక్ కంపెనీలో బాంబు తయారీ


అఖాయెద్‌ ఉల్లా తాను పనిచేస్తోన్న ఎలక్ట్రిక్‌ కంపెనీలోనే బాంబును తయారుచేసినట్లు విచారణలో వెల్లడైంది. ఐసిస్‌ ప్రభావితుడైన ఉల్లా గుట్టుచప్పుడు కాకుండా పైప్‌ బాంబును తయారుచేశాడు. రద్దీగా ఉండే చోట దానిని పేల్చాలని ప్లాన్ చేశాడు. కానీ, సరిగా ఆ బాంబును పేల్చలేదు. ఉల్లా వేసుకున్న జాకెట్‌, దుస్తులు, పొట్టభాగంలో కుడివైపు స్వల్పంగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఉల్లాతోపాటు మరో ముగ్గురు గాయపడ్డారు

 ఏడేళ్ళుగా అమెరికాలోనే

ఏడేళ్ళుగా అమెరికాలోనే


ఉగ్రవాదిగా భావిస్తోన్న వ్యక్తిని అఖాయెద్‌ ఉల్లాగా గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇతను.. గత ఏడేళ్లుగా అమెరికాలోనే నివసిస్తున్నట్లు తెలిసింది.బాంబ్‌ స్క్వాడ్ సాయంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు.

బాంబు పేలితే

బాంబు పేలితే


న్యూయార్క్‌ నగరంలోని మాన్‌హట్టన్‌ 42వ వీధి, 8వ అవెన్యూలో గల పోర్ట్‌ అథారిటీ బస్‌ టెర్మినల్‌ వద్ద పైప్ బాంబు సరిగా పేలితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.బాంబును సరిగా పేల్చడంలో అఖాయెద్‌ ఉల్లా విఫలమయ్యాడు. ఒక వేళ బాంబు సరిగా పేలి ఉంటే ఈ పాటికి మనం ఘోరవిషాదాన్ని చూసేవాళ్లమని అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Police have descended on New York's main bus station after reports of an explosion - with terrified tourists seen "stampeding" from the area.A bomb squad has reportedly been dispatched to Manhattan's Port Authority Bus Terminal following the "large" blast this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X