వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 మంది మహిళలకు లైంగిక వేధింపులు, అసభ్యంగా..: న్యూయార్క్ గవర్నర్ రాజీనామాకు డిమాండ్

|
Google Oneindia TeluguNews

అమెరికా: న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో 11 మంది మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేశారని అటార్నీ జనరల్ లెతితయజేయ్స్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. దీంతో గవర్నర్ ఆండ్రూ రాజీనామా చేయాలనే డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి.

11 మంది మహిళలపై న్యూయార్క్ గవర్నర్ లైంగిక వేధింపులు

11 మంది మహిళలపై న్యూయార్క్ గవర్నర్ లైంగిక వేధింపులు

ఆండ్రూ క్యూమో మహిళలపై అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తించారని దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఆయనపై నలువైపుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
బాధ్యతాయుత, గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలాంటి నీచమైన పనులు చేస్తారా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, క్యూమో ఆండ్రూ.. మాజీ ఉద్యోగులను, అనేక మంది మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు కార్యాలయ దర్యాప్తులో తేలింది. దర్యాప్తునకు సంబంధించిన సుదీర్ఘమైన నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఈ నివేదికలో 11 మంది మహిళలపై ఆయనతోపాటు సీనియర్ సిబ్బంది కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్పష్టమైందని అటార్నీ జనరల్ జేమ్స్ తెలిపారు.

దర్యాప్తులో బయటపడ్డ నిజాలు

దర్యాప్తులో బయటపడ్డ నిజాలు


గవర్నర్‌ క్యూమోపై వచ్చిన ఆరోపణలపై ఐదు నెలలపాటు దర్యాప్తు చేయగా .. జాతీయ, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించి పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని తేలిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులతోపాటు న్యూయార్క్ స్టేట్ ఉద్యోగినులతో కూడా అసభ్యంగా ప్రవర్తించారని, అభ్యంతరకర భాగాల్లో తాకడం, వారిని ద్వందార్థం వచ్చే మాటలతో ఇబ్బంది పెట్టారని జేమ్స్ తెలిపారు. తన వేధింపుల బండారం బయటపెట్టారనే కోపంతో ఆండ్రూ క్యూమో తన సిబ్బందిపై ప్రతీకార చర్యలకు పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది.

Recommended Video

Ram Charan క్రేజ్ కా బాప్, మీసం తిప్పిన చరణ్ ! | RRR Movie || Oneindia Telugu
గవర్నర్ క్యూమో రాజీనామాకు డిమాండ్

గవర్నర్ క్యూమో రాజీనామాకు డిమాండ్

గవర్నర్ క్యూమోపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ సభ్యురాలు ఎలిస్ స్టెఫానిక్ డిమాండ్ చేశారు. గవర్నర్ క్యూమో తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని జేమ్స్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. క్యూమో గవర్నర్ పదవికి అనర్హుడని న్యూయార్క్ అసెంబ్లీ స్పీకర్ కార్ల్ హెస్టీ వ్యాఖ్యానించారు. కాగా, గవర్నర్ ఆండ్రూపై వచ్చిన ఆరోపనలపై విచారణ కోసం 179 మంది వ్యక్తులను విచారించారు. 74,000 సాక్ష్యాలను సమీక్షించామని జేమ్స్ తెలిపారు. ఈ దర్యాప్తులో క్యూమో బాధిత మహిళలు తమ ఆవేదనను చెప్పుకున్నారని వెల్లడించారు. అయితే, తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు అవావస్తమని అన్నారు. తాను ఏ మహిళనూ అభ్యంతరకరంగా తాకలేదని, లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఇవన్నీ కుట్రతో తనను అప్రతిష్టపాలు చేయడానికేనని అన్నారు.

English summary
New York governor Andrew Cuomo demands to resign after probe finds he harassed 11 women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X