వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఆర్థిక రాజధాని బతుకు ఛిద్రం: న్యూయార్క్‌లో 10 వేలను దాటిన కరోనా మరణాలు..

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆధునికతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటోన్న న్యూయార్క్.. ఈ వైరస్ బారిన పడి దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొంటోంది. అమెరికాలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక్క న్యూయార్క్‌పై కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది. న్యూయార్క్‌లో కరోనా ఏ స్థాయిలో చెలరేగిపోతోదంటే.. అమెరికాలో నమోదైన కరోనా మరణాల్లో అత్యధిక వాటా ఈ రాష్ట్రానిదే. .

 10 వేలు దాటిన కరోనా మరణాలు..

10 వేలు దాటిన కరోనా మరణాలు..


న్యూయార్క్‌లో కరోనా వైరస్ మరణాలు 10 వేల మార్క్‌ను అధిగమించాయి. 10,056 మంది కరోనా వైరస్ వల్ల మరణించినట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 671 మంది మరణించినట్లు చెప్పారు. శనివారం నాడు 758 మంి మృతిచెందారని, ఇదివరకు నమోదైన మరణాలతో పోల్చుకుంటే.. ఈ సంఖ్య కాస్త తక్కువేనని అన్నారు. అల్బనీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ వల్ల సంక్షోభం తలెత్తిందని, దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇంతకు మించి మరొకటి ఉండకపోవచ్చని చెప్పారు.

రెండు లక్షలకు చేరువగా పాజిటివ్ కేసులు..

రెండు లక్షలకు చేరువగా పాజిటివ్ కేసులు..

ఒక్క న్యూయార్క్‌లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువగా ఉంటోంది. ప్రస్తుతం అక్కడ 1,95,655 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1,68,510 యాక్టివ్ కేసులు ఉంటున్నాయి. వారిలో పలువురి ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా ఉంటోందని, ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి అసవరమైన అన్ని చర్యలను చేపట్టామని, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)లను సరఫరా చేస్తున్నామని న్యూయార్క్ గవర్నర్ చెప్పారు.

మరణాల్లో అధిక వాటా న్యూయార్క్‌దే

మరణాల్లో అధిక వాటా న్యూయార్క్‌దే

అమెరికాలో మొత్తం 23, 640 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించగా.. అందులో అత్యధిక వాటా న్యూయార్క్‌దే కావడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికాకు ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన ఈ నగరం.. చివరికి కరోనా వైరస్ మరణాల్లో కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. న్యూయార్క్ జంట నగరం న్యూజెర్సీలో కూడా కరోనా వల్ల మరణించే వారి సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది. న్యూజెర్సీలో 2443 మంది కరోనా వల్ల మృతిచెందారు. మిచిగాన్‌లో 1602 మంది చనిపోయారు. ఈ మూడు నగరాల్లోనే కరోనా మరణాలు నాలుగంకెలను అందుకున్నాయి.

మిచిగాన్ మినహా..

మిచిగాన్ మినహా..

న్యూయార్క్, న్యూజెర్సీ, మిచిగాన్ మినహా మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో మరణాలు నమోదు కాలేదు. అన్నీ వెయ్యికిలోపే ఉంటున్నాయి. న్యూజెర్సీ, మసాచ్చుసెట్స్, మిచిగాన్, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, లూసియానా వంటి నగరాల్లో 20 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో చాలావరకు యాక్టివ్ కేసులేనని హాప్‌కిన్స్ యూనివర్శిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Recommended Video

కరోనా వైరస్ : America Reported 1,858 In Single Day, A Record High

English summary
New York Governor of the US state of New York Andrew Cuomo said statewide deaths from COVID-19 rose to 10,056, adding "the worst is over if we continue to be smart" in coping with the novel coronavirus. Cuomo on Monday said at his daily briefing that a total of 671 people passed away on Sunday due to the disease, a number much lower than in the past few days, Xinhua news agency reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X