వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాను తరిమికొట్టిన తొలి దేశంగా..:సింగిల్ డిజిట్‌లో పాజిటివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: కరోనా వైరస్ బారిన పడి ప్రపంచ దేశాలు అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని తరిమికొట్టినట్టుగా ప్రకటించుకుంది న్యూజిలాండ్. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని పూర్తిగా అడ్డుకోగలిగామని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. వందల సంఖ్యలో ఉన్న పాజిటివ్ కేసులను సింగిల్ డిజిట్‌కు తీసుకుని రాగలిగామని అన్నారు. సోమవారం నాటికి తమ దేశంలో మూడు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు చెప్పారు.

డ్రాగన్‌ వైపే డబ్ల్యూహెచ్ఓ: భారత భూభాగం చైనాకు చెందినదిగా: ట్రంప్ విమర్శల్లో అర్థం ఉన్నట్టేడ్రాగన్‌ వైపే డబ్ల్యూహెచ్ఓ: భారత భూభాగం చైనాకు చెందినదిగా: ట్రంప్ విమర్శల్లో అర్థం ఉన్నట్టే

కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం వల్ల లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ను మూడు దశలకు కుదించినట్లు చెప్పారు. తమ దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గడానికి, మరణాల సంఖ్యను అడ్డుకోవడంలో డాక్టర్ల సేవలు ప్రధాన కారణం అయ్యాయని అన్నారు. చిరస్మరణీయమైన సేవలను అందించారని జెసిండా చెప్పారు. కరోనా వైరస్‌ వెలుగు చూసిన వెంటనే అనేక ముందు జాగ్రత్తలను తీసుకున్నామని, అవే తమ దేశాన్ని కాపాడాయని అన్నారు.

New Zealand claims first country as elimination of Covid-19 with new cases in single digits

ప్రజలు తమకు సహకరించారని చెప్పారు. ప్రజల సహకారం లేకపోయి ఉంటే తాము ఈ విజయాన్ని సాధించి ఉండేవాళ్లం కాదని అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలను ముందుగా అప్రమత్తం చేశామని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. వైరస్ నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. సాధారణ పరిస్థితులకు రావడానికి కొంత సమయం పడుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ చెప్పారు. అప్పటి వరకూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

తమ దేశ ప్రజల ఆరోగ్య విషయంలో తాము ఎలాంటి రాజీధోరణిని ప్రదర్శించే సమస్యే లేదని అన్నారు. వైరస్ తీవ్రత కనిపించతే మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి వెనుకాడబోమని యాష్లే చెప్పారు. అయిదు దశల్లో కొనసాగిన లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రస్తుతం మూడో దశకు తీసుకొచ్చామని, ఈ ఆంక్షలు మరి కొన్ని రోజుల పాటు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొత్తగా కనిపించితే.. మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

English summary
New Zealand claimed Monday it had "eliminated" the coronavirus as the country announced the easing of restrictions from "level four" to "level three," with new cases in single figures. At a news conference, New Zealand reported one new case, four "probable cases" and one new death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X