వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్‌కు షాక్: భారీ భూకంపాలు, సునామీలు, 7 నిమిషాలే టైమ్

న్యూజిలాండ్‌ ద్వీపంలో పెను భూకంపాలు విధ్వంసం సృష్టిస్తాయని జియాలజిస్టులు హెచ్చరించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌ ద్వీపంలో పెను భూకంపాలు విధ్వంసం సృష్టిస్తాయని జియాలజిస్టులు హెచ్చరించారు.2011లో జపాన్‌లో చోటు చేసుకొన్న తరహ భూకంపాలే న్యూజిలాండ్‌లో చోటు చేసుకొనే అవకాశాలున్నాయని జియాలజిస్టులు ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకొంటున్న మార్పుల కారణంగా పెను విధ్వంసాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పగలు తగ్గిన కారణంగా కూడ పెను భూకంపాలు సంభవించే అవకాశాలు కూడ ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

షాక్: పగలు తగ్గింది, 2018లో పెను భూకంపాలుషాక్: పగలు తగ్గింది, 2018లో పెను భూకంపాలు

అయితే పగలు తగ్గడం వల్ల ఉత్పన్నమయ్యే భూకంపాలు పెను ప్రమాదం సృష్టించే అవకాశం ఉందని ఇటీవలనే ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆ హెచ్చరికలు జారీ చేసి వారం కూడ దాటక ముందే న్యూజిలాండ్‌లో పెను భూకంపాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించడం గమనార్హం.

న్యూజిలాండ్‌లో పెను భూకంపాలు

న్యూజిలాండ్‌లో పెను భూకంపాలు

న్యూజిలాండ్‌ ద్వీపంలో పెను భూకంపాలు విధ్వంసం సృష్టిస్తాయని సోమవారం జియాలజిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. న్యూజిలాండ్‌కు చేరువలో ఉన్న హికురంగీ పీఠభూమిలో వస్తున్న కదలికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ పెను భూకంపాల ధాటికి న్యూజిలాండ్‌పై భారీ సునామీలు విరుచుకుపడతాయని వెల్లడించారు.

జపాన్‌లో కంటే భయంకరమైన భూకంపం

జపాన్‌లో కంటే భయంకరమైన భూకంపం

2011లో జపాన్‌లో భూకంపం వల్ల వచ్చిన విపత్కర పరిస్థితులు న్యూజిలాండ్‌లోనూ కనిపిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సోమవారం 4.1 తీవ్రతతో న్యూజిలాండ్‌ రాజధాని వెల్లింగ్‌టన్‌ సాధారణ భూకంపం సంభవించింది. 2011లో జపాన్‌లో తీవ్రమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో పెను విధ్వంసం జరిగింది.

 సునామీలు ముంచెత్తుతాయి

సునామీలు ముంచెత్తుతాయి

న్యూజిలాండ్‌లో 9.0 కంటే అధిక తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భూకంపాలు సునామీలకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. జపాన్‌లో చోటు చేసుకొన్న పరిణామాలనే న్యూజిలాండ్‌లో పునరావృతమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

 తప్పించుకొనేందుకు ఏడు నిమిషాలే

తప్పించుకొనేందుకు ఏడు నిమిషాలే

సునామీ నుంచి తప్పించుకునేందుకు న్యూజిలాండ్‌ ప్రజలకు కేవలం ఏడే నిమిషాలు సమయం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రెండు టెక్టోనిక్‌ ప్లేట్లు ఒకదానిపై మరొకటి చేరడంతో జపాన్‌ పెను భూకంపం వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు న్యూజిలాండ్‌ వద్ద కూడా అదే జరగబోతోందని అన్నారు. 2004లో ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో 9.1 భూకంపం సంభవించి పెను సునామీ 2,50,000 మందిని బలిగొంది.

English summary
NEW ZEALAND could be in the firing line of a devastating tsunami and earthquake after the awakening of a dormant fault line, a geologist warns.The long-dormant Hikurangi fault line was recently re-energised and could now produce a deadly magnitude 9.0 earthquake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X