• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శుభవార్త: టెక్కీలకు ఉచిత ప్రయాణం, వసతిని కల్పించనున్న న్యూజిలాండ్, అమెరికాకు చెక్?

By Narsimha
|

వెల్లింగ్టన్:అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాద్యతలు చేపట్టిన నాటి నుండి విదేశీయులకు ఆ దేశంలో ఇబ్బందికర నిబంధనలను అమల్లోకి తెచ్చారు. అయితే అమెరికాలోని ఆంక్షల నేపథ్యంలో న్యూజిలాండ్ టెక్కీలను మంచి ఆఫర్ ను ప్రకటించింది.ఉచిత ప్రయాణంతో పాటు , ఉచిత బస ఏర్పాటును కూడ టెక్కీలకు కల్పిస్తామని న్యూజిలాండ్ ప్రకటించింది.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక ఆ దేశంలో ప్రధానంగా భారతీయులను లక్ష్యంగా చేసుకొని దాడులు సాగుతున్నాయి. అమెరికేతరులపై వివక్ష సాగుతోంది.తమ దేశాన్ని విడిచిపోవాలని అమెరికన్లు కొందరు ఇతర దేశస్తులపై దాడులకు దిగుతున్నారు.

ప్రధానంగా ఐటి కంపెనీలపై ట్రంప్ పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరుతో ఐటి కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలను కట్టబెట్టాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా నుండి వచ్చే టెక్కీలను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ ఈ రకమైన నిర్ణయాలను తీసుకొందనే విమర్శలు కూడ లేకపోలేదు.

అంతే కాదు ఐటి కంపెనీల్లో పనిచేస్తోన్న ఇతర కంపెనీలకు చెందిన ఉద్యోగులు అమెరికా నుండి బయటకు వెళ్ళిపోయేలా అనివార్య పరిస్థితులను కల్పిస్తున్నారు. మరో వైపు అమెరికాలో జాతి విద్వేషదాడులు కొనసాగుతున్నాయి.

టెక్కీలకు న్యూజీలాండ్ బంఫర్ ఆఫర్

టెక్కీలకు న్యూజీలాండ్ బంఫర్ ఆఫర్

ట్రంప్ పాలకవర్గం అనుసరిస్తున్న విధానాలతో టెక్కీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే ఈ పరిస్థితులను గమనించిన న్యూజిలాండ్ దేశం టెక్కీలకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తమ దేశంలో పనిచేసేందుకు వచ్చే టెక్కీలకు ఉచిత ప్రయాణ వసతితో పాటు ఉచిత బసను కూడ ఏర్పాటు చేస్తామని ఆ దేశం ప్రకటించింది.

జాబ్ ఆఫర్లను ప్రకటిస్తోన్న న్యూజిలాండ్

జాబ్ ఆఫర్లను ప్రకటిస్తోన్న న్యూజిలాండ్

న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేసేందుకు ఆసక్తి ఉన్న టెక్కీలకు సకల వసతులను కల్పిస్తామని న్యూజిలాండ్ ప్రకటించింది.వంద టెక్ వర్కర్లకు ఈ ఆఫర్ ను అందిస్తోంది.జాబ్ ఇంటర్వ్యూకు వచ్చిన వారికి ఈ ఆఫర్ ను అందించనున్నట్టు చెప్పా,రు. లుక్ సీ పేరుతో వెల్లింగ్టన్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది న్యూజిలాండ్.

మే లో ఇంటర్వ్యూలు

మే లో ఇంటర్వ్యూలు

ఈ ఏడాది మే 8 నుండి 11 వరకు నాలుగురోజుల పాటు జాబ్ ఇంటర్వ్యూలకు టెక్ లీడర్లతో పాటు మీట్ ఆప్స్ కు ఈ అరెంజ్ మెంట్స్ చేస్తోంది..తమ టెక్ ఆవిష్కరణలు సుదూర ప్రదేశాలకు ప్రయాణించాలని తాము భావిస్తున్నామన్నారు.ఎక్కువమంది ప్రతిభావంతులైన కావాలని న్యూజిలాండ్ కోరుకొంటోంది.ఇంటర్వ్యూలకు హజరుకావాల్సిన వారు తొలుత తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెఫ్టర్ చెప్పారు.

వందమందికి ఉచిత ఆఫర్

వందమందికి ఉచిత ఆఫర్

ఈ జాబ్ ఇంటర్వ్యూలకు హజరయ్యే అభ్యర్థుల్లో వందమందికి ఉచిత ఆఫర్ ను వర్తింపజేయనున్నట్టు వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెఫ్టర్ ప్రకటించారు. అభ్యర్థులను ఇంటర్వ్యూకు వెల్లింగ్టన్ కు ఆహ్వనించనున్నట్టు ఆయన చెప్పారు. అనంతరం ఎంప్లాయిర్స్ అభ్యర్థులను నామినేట్ చేస్తోంది. ఈ విధంగా జరిగిన ప్రక్రియలో అందుబాటులో ఉన్న వంద స్పాట్స్ లో అవకాశం దక్కించుకొన్నందుకు ఈ ఆఫర్ ను పొందాల్సి ఉంటుంది. అనంతరం వెల్లింగ్టన్ లో జాబ్ ఇంటర్వ్యూకు హజరుకావాలన్నారాయన.

English summary
A free trip to New Zealand from anywhere in the world. Free accommodation and some sightseeing as well. This is what New Zealand's capital city Wellington is offering to 100 tech workers to lure them for a job interview. The city has launched a campaign called LookSee as part of its efforts to boost footprint as a tech hub.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more