వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిజికల్ డిస్టెన్స్: ప్రియుడితో ప్రధాని డేట్.. చోటులేదు పొమ్మన్న రెస్టారెంట్..

|
Google Oneindia TeluguNews

సాధారణంగా పబ్లిక్ ప్లేసుల్లో పెద్ద వాళ్లు కనిపిస్తే గౌరవించి చోటిస్తాం.. అదే పొలిటీషియన్లయితే ప్రజల్ని కూడా నెట్టిపారేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించేస్తారు.. మరి సాక్ష్యాత్తూ ప్రధానమంత్రే ఎంటరైతే.. ఆ దరిదాపుల్లోకి కూడా సామాన్యులను రానివ్వరు.. అయితే కల్చర్ పరంగా అభవృద్ధి చెందిన దేశాల్లో మాత్రం వ్యవహారాలు భిన్నంగా సాగిపోతుంటాయి. చట్టం అందరికీ సమానం అనే విషయాన్ని అక్కడి నేతలు ఎన్నటికీ మర్చిపోరు. ఇలాంటి వార్తలకు న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్‌ పెట్టింది పేరు.

దేశరాజధాని వెల్లింగ్టన్ లో 'ఆలివ్' రెస్టారెంట్ చాలా ఫేమస్. అక్కడికి ప్రధాని జసిండా తన ప్రియుడు, ఫియాన్సే క్లార్క్ గేఫోర్డ్‌తో కలిసి శనివారం డేట్‌కు వెళ్లారు. టేబుల్స్ ఖాళీగా కనిపించడంతో లోపలికి వెళ్లబోగా.. ఆమెను రెస్టారెంట్ సిబ్బంది అడ్డుకున్నారు. ఫిజికల్ డిస్టెన్సింగ్ రూల్స్ ప్రకారమే టేబుల్స్ మధ్య గ్యాపిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేసుకున్నామని, లెక్క ప్రకారం సీట్లు నిండుకున్నాయని వివరించారు. దీంతో ప్రధాని రోడ్డుమీదే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎంతకీ చోటు దక్కక వెనుతిరిగేలోపే..

 New Zealand PM Jacinda Ardern rejected from cafe at coronavirus capacity

రెస్టారెంట్ మేనేజర్ పరుగున వచ్చి, ఓ టేబుల్ ఖాళీ అయిందని చెప్పిన తర్వాతగానీ జసిండా జంట లోనికి వెళ్లలేకపోయారు. చోటు లేదన్నప్పుడు ప్రధాని ఏమాత్రం నొచ్చుకోలేదని, లోపల అరగంటకుపైగా గడిపిన ఆమె.. సిబ్బందితో ఆప్యాయంగా మాట్లాడారని, బిల్లుతోపాటు టిప్పుకూడా చెల్లించి వెళ్లారని రెస్టారెంట్ మేనేజర్ మీడియాకు తెలిపారు.

 New Zealand PM Jacinda Ardern rejected from cafe at coronavirus capacity

న్యూజిలాండ్ లో కరోనా వైరస్ ఉధృతి తగ్గడంతో రెండ్రోజుల కిందటే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశారు. అయితే సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను మాత్రం అందూ కఠినంగా ఫాలో కావాల్సిందేనని ప్రధాని జసిండా ఆదేశాలు జారీచేశారు. ఆమేరకు రెస్టారెంట్లు, ఇతర పబ్లిక్ పేసుల్లో పరిమిత సంఖ్యలోనే కస్టమర్లను అనుమతిస్తున్నారు. అలా తాను జారీ చేసిన రూల్స్ ప్రకారం ప్రధాని కూడా బయటే నిలబడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ లో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 1499 నమోదుకాగా, అందులో 1433 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 45 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. వైరస్ వ్యాప్తిని నిలువరించిన మొదటి దేశంగా న్యూజిలాండ్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.

English summary
Jacinda Ardern, her fiance Clarke Gayford and a group of friends were turned away from a cafe in Wellington on Saturday because it had already reached its customer limit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X